కరోనాతో సుదీర్ఘకాలం పోరాడాల్సింద

కరోనాతో సుదీర్ఘకాలం పోరాడాల్సిందే :: భారత ప్రధాని నరేంద్ర మోడీ

దిల్లీ: కరోనాతో దీర్ఘకాలం పోరాడాల్సిందే నని,  పోరాటం ఇప్పట్లో ముగిసేది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. . తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో గురువారం దిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.  కరోనా  నియంత్రణలో మెరుగైన ఫలితాలను సాధించిన రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్  ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో ఉందన్నారు. ‘‘ వంద సంవత్సరాల  క్రితం ఇలాంటి భయంకరమైన మహమ్మారి వచ్చింది. అప్పుడు భారతదేశ జనాభా చాలా తక్కువ. అయినప్పటికీ కోట్లాది మంది చనిపోయారు. ఇప్పుడు జనాభా భారీగా పెరిగింది. దీనివలన మన దేశంలో పరిస్థితులు దారుణంగా దిగజారి పోవచ్చని నిపుణులు హెచ్చరించారు. 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ అదృష్టవశాత్తు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలవల్ల యూపీలో కేవలం 800 మంది మాత్రమే మరణించారు’’ అని మోదీ పేర్కొన్నారు