ఆళ్లగడ్డ :(విభారె న్యూస్): ఆళ్లగడ్డ పట్టణంలో కరోనా మరణ మృదంగంమొదలైంది. కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య రెండుకు పెరిగింది. రోజుకు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ ల సంఖ్య ఆర్లగడ్డ పట్టణ వాసులను బెంబేలెత్తిస్తోంది. కుద్భా వీధికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మరణించడంతో ఆర్లగడ్డ పట్టణంలో కరోనా కేసుల సంఖ్య 17కు పెరిగింది. మొత్తం మీద ఆళ్లగడ్డలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పై ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించి వారికి సహకరించాల్సిందిగా ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు