
ఆళ్లగడ్డ::( విభారె న్యూస్): రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి బారినపడి ఆళ్లగడ్డ పట్టణంలో అమ్మవారి శాల వీధికి చెందిన ఉల్లిగడ్డల వ్యాపారి మరణించాడు. నాలుగు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో కర్నూల్ లోని ఒక ప్రైవేటు వైద్యశాలకు చికిత్స నిమిత్తం వెళ్ళినప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొనగా పాజిటివ్ గా తేలింది. వెంటనే కర్నూలు లోనే రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరారు. గత మూడు రోజులుగా హాస్పిటల్ లోనే చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించినట్లు తెలిసింది. కానీ సంబంధిత అధికారులు మాత్రం వారి కుటుంబ సభ్యులకు ఈరోజు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు కర్నూలు తరలివెళ్లారు. ఆళ్లగడ్డ పట్టణంలో తొలిసారిగా కరోనా మరణం నమోదు కావడంతో పట్టణ ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇప్పటివరకు ఆళ్లగడ్డ పట్టణంలో పదహారు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కమిషనర్ తెలిపారు. నిన్నటి వరకు పన్నెండు గా ఉన్న ఈ సంఖ్య, ఈరోజు వెలువడిన నిర్ధారణ ఫలితాలలో కొత్తగా నాలుగు కేసులు నమోదైనట్లు తెలిసింది. దీంతో వీటి సంఖ్య పదహారుకు చేరింది.