ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్): జిల్లా వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో నమూనాలు సేకరించడం వలన కరోనా పరీక్షా ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. దీంతో కరోనా పరీక్షకు నమూనాలు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. ఇకనుండి ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే వారి ఇంట్లో సౌకర్యాలను బట్టి వారి సొంత ఇంటిలోనే హోమ్ క్వారంటైన్ లో ఉంచుతారు. కోవిడ్ వైద్య బృందాలు హోమ్ క్వారంటైన్ లో ఉన్న పేషెంట్ ఇంటి దగ్గరికి వచ్చి చికిత్స అందిస్తారు. కేవలం రోగి పరిస్థితి విషమించిన అప్పుడు మాత్రమే ప్రభుత్వ క్వారంటైన్ లకు తరలిస్తారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని కమిషనర్ తెలిపారు. రేపటి నుంచి లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, తెలిపారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారి పట్ల ప్రజలు ఎవరైనా అవమానకరంగా, అభ్యంతరకరంగా మాట్లాడితే వారిపై కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటికి రావాలని, మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సూచించారు.