నకిలీ ప్రభుత్వ ఉపాధ్యాయుల పై కేసు నమోదు, అరెస్ట్.

ఆగ్రా :43 మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉద్యోగం పొందడానికి నకిలీ బి.ఎడ్ డిగ్రీలను ఉపయోగించినందుకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించి వారిపై    ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆగ్రాలో 24 మరియు కన్నౌజ్ లో  19 మంది ఉపాధ్యాయులు  దాదాపు  10 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు.  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడటానికి ముందు మార్చిలో వీరు విధుల నుండి తొలగించబడ్డారు.

ఆగ్రా, కన్నౌజ్‌లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల కనీసం 43 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు దక్కించుకోవడానికి నకిలీ బి.ఎడ్ డిగ్రీలను ఉపయోగించారనే ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ ప్రారంభించారు.

గత దశాబ్ద కాలంగా వారికి జీతాలుగా చెల్లించిన డబ్బును వారి నుండి తిరిగి వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఆగ్రా లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం  లో 2004-05 బి.ఈడి. డిగ్రీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న యుపి పోలీసుల ప్రత్యేక విచారణ అధికారుల బృందం నివేదిక సమర్పించిన తరువాత ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

గత డిసెంబర్‌లో తన నివేదికను సమర్పించిన సిట్, విశ్వవిద్యాలయం నుండి 4,766 మంది విద్యార్థులు నకిలీ బి.ఎడ్ మార్క్ షీట్లను అందుకున్నట్లు కనుగొన్నారు. 1,084 మంది విద్యార్థుల మార్క్ షీట్లను ట్యాంపర్ చేయగా, 45 మంది విద్యార్థులకు డూప్లికేట్ రోల్ నంబర్లు ఉన్నాయని, మరో 3,637 మంది రోల్ నంబర్లు విశ్వవిద్యాలయ రికార్డుతో సరిపోలడం లేదని నివేదిక లో పేర్కొన్నారు.SIT  వారిని దోషులుగా గుర్తించిన, తరువాత వారిని ఉద్యోగాల నుండి తొలగించారు. దర్యాప్తు పూర్తి చేసి, త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆగ్రాలోని షాగంజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సతేంద్ర సింగ్ అన్నారు, స్థానిక ప్రాథమిక శిక్షా అధికారి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.

 మొత్తం 43 మంది ఉపాధ్యాయులపై మోసం (ఐపిసి సెక్షన్ 420), ఫోర్జరీ (ఐపిసి సెక్షన్ 468) కేసు నమోదు చేశారు.