మహానందిలో ఘనంగా తొలి ఏకాదశి

 మహానంది :(విభారె న్యూస్): మహానంది క్షేత్రం లో   తొలి ఏకాదశి పండుగ ఈరోజు ఘనంగా జరిగింది.ఈసందర్భంగా గణపతి పూజ,పుణ్యాహవాచనము తిరుమంజనసేవ వివిధ రకాల మూలికలతో కూడిన మంత్ర జలంతో ఆలయ శుద్ధి, మూలమూర్తులకు విశేష అభిషేకార్చనలు మొదలగు కార్యక్రమాలు కార్యనిర్వహణాధికారి మల్లిఖార్జున ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగినట్లు మహానందీశ్వర దేవస్థానం వేదపండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రారంభానికి ముందు మరియు కార్యక్రమం ముగిసిన తర్వాత శానిటైజేషన్   చేసినట్లు ఆయన తెలిపారు