కరోనాకు ” వీడ్కోలు” పార్టీ

ప్రెగ్యు :(చెక్ రిపబ్లిక్) 
 ప్రభుత్వం పూర్తిగా లాక్ డౌన్ నిబంధనలు తొలగించడంతో అక్కడి ప్రజలు కరోనాకు వీడ్కోలు చెబుతూ పెద్ద ఎత్తున విందులు వేడుకలు చేసుకున్నారు. చారిత్రాత్మకమైన చార్లెస్ బ్రిడ్జ్ పైన  దాదాపు 1640 అడుగుల పొడవైన డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకుని వేడుకలు జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండి ఆహార పదార్థాలు తీసుకువచ్చి అక్కడ ఒకరికొకరు పంచుకున్నారు. అక్కడ ఏ ఒక్కరూ కూడా సామాజిక దూరాన్ని పాటించలేదు. ఒకరినొకరు తాకుతూ, పాడుతూ, నృత్యాలు చేశారు. ఈ వేడుక ఒక స్థానిక హోటల్ యజమాని నిర్వహించారు. ఇక్కడి ప్రజలకు కరోనా అంటే భయం లేదని తెలిపేందుకే ఈ వేడుకలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల కొరకు తమ సీట్లను ముందే బుక్ చేసుకున్నారు.  ఈ దేశంలో ఇప్పటివరకూ 11,900 పాజిటివ్ కేసులు ఉన్నాయి. 349 మంది మరణించారు.