
మాస్కు ధరించనందుకు దేశ ప్రధానమంత్రికి 13 లక్షల రూపాయల జరిమానా
బల్గేరియా : అధికారులు ఎంత మొత్తుకున్నా వినకుండా, ప్రజలు నిబంధనలు పాటించకుండా పెడచెవిన పెడుతున్నారు. మాస్కు ధరించకుండా బల్గేరియన్ ప్రధానమంత్రి బాయికో బోరిసూ తన దేశంలోని ఒక ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చినప్పుడు ముఖానికి మాస్కు ధరించకపోవడం వలన అక్కడి అధికారులు 13 లక్షల రూపాయలు జరిమానా విధించారు. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తన సందేశంలో క్రమశిక్షణకు ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. భారతదేశంలో కూడా అధికారులు పక్షపాతం లేకుండా పనిచేయాలన్నారు.