ప్రజా టీవీలో ప్రసారమైన వార్తపై ఆర్లగడ్డ లో టెన్షన్

ఆళ్లగడ్డ :(విభారె న్యూస్): ఆళ్లగడ్డలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆళ్లగడ్డ బృందావన్ కాలనీ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆళ్లగడ్డ పట్టణంలో కరోనా బాధితుల సంఖ్య ఆరుకు చేరింది.  సదరు కరోనా బాధితుడు ఆళ్లగడ్డ పట్టణంలోని ఓ ప్రైవేట్ క్లినిక్ లో చేరి గత ఆరు రోజులుగా చికిత్స పొందినట్లు నిన్న ప్రజా టీవీ లో వచ్చిన వార్త చూసి ఆర్లగడ్డ ప్రజలు ఆ హాస్పిటల్ వివరాల కోసం చర్చించుకుంటున్నారు. ఈ విషయమై చర్చించేందుకు ఉన్నతాధికారులు సమీక్ష జరుపుతున్నారు. సమీక్ష అనంతరం అధికారులు వెల్లడించే వివరాలపై ఆళ్లగడ్డ ప్రజలలో ఉత్కంఠ నెలకొని ఉంది.అధికారులు ఆ హాస్పిటల్ వివరాలకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అధికారులు వెల్లడించే వివరాల కోసం ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ప్రజలు పత్రికా ప్రతినిధులకు  ఫోను చేసి బాధితుడికి చికిత్స చేసిన ఆ ప్రైవేటు వైద్యశాల వివరాల కోసం సంప్రదిస్తున్నారు. బృందావన్ కాలనీ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్ గా ప్రకటిస్తున్నట్లు కమిషనర్ రమేష్ బాబు తెలిపారు.  అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే వరకూ ఎదురు చూడాల్సిందే. వీలైనంత త్వరగా వైద్యశాల వివరాలు కనుక్కొని తగిన చర్యలు తీసుకుని కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.