ప్రవర్తన మెరుగుపరిచేందుకు 80 మంది పోలీసులకు

ప్రవర్తన మెరుగుపరిచేందుకు 80 మంది పోలీసులకు 

ప్రత్యేక శిక్షణ  :  తమిళనాడు డి. ఐ.జి

త్రిచి 🙁 తమిళనాడు): తమిళనాడులో పోలీస్ లాకప్ లో తండ్రి కొడుకులు మరణించిన సంఘటనపై ప్రక్షాళన చర్యలు చేపట్టినట్టు తమిళనాడు త్రిచి రేంజ్ డిఐజి వి.బాలకృష్ణన్  తెలిపారు. ప్రజల పట్ల పోలీసుల ప్రవర్తనను మెరుగుపరిచేందుకు రూపొందించిన ప్రత్యేక కోర్సును పూర్తి చేసిన తర్వాతనే వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. ప్రజలతో ప్రవర్తించే తీరు సరిగా లేని పోలీసు అధికారులకు సంబంధించిన ఒక జాబితా తయారు చేసినట్లు ఆయన తెలిపారు. తూత్తుకుడి పోలీస్ స్టేషన్లో తండ్రీకొడుకులు మరణించడం పై దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆగ్రహం వెల్లువెత్తడం పట్ల స్పందించిన తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్యలను చేపట్టినట్లు తెలిసింది. ప్రజలతో వారి వ్యవహార శైలి సరిగా లేనందున వారి వారి ప్రవర్తన మెరుగుపరిచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.  ప్రవర్తన సరిగా లేని అధికారులను ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని విధుల్లో వారిని ఉంచుతారు. ప్రత్యేకంగా రూపొందించబడిన “కాగ్నిటివ్ బిహేవియరల్ థెరఫీ” అనే కోర్సును పూర్తి చేసిన తర్వాతనే వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటారు