ఆళ్లగడ్డ డి.ఎస్.పి పోతురాజు గారికి ప్రశంసా పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్.

ఆళ్లగడ్డ:(విభారె న్యూస్): విశాఖ ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదాన్ని మరువక ముందే,  నంద్యాల ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీలో గ్యాస్ లీకేజీ ఆ ప్రాంత వాసులను ఉలిక్కిపడేలా చేసింది. కానీ గ్యాస్ లీకేజీ ని అత్యంత చాకచక్యంగా నిలువరించి, పెను ప్రమాదాన్ని సత్వరమే అరికట్టడంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి, విశేష ప్రతిభ కనపరచి  సాహసోపేతంగా అనేక ప్రాణాలను కాపాడిన అధికారులను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ప్రశంసించారు. ప్రమాదాన్ని సమన్వయంతో సత్వరమే అరికట్టిడంలో అద్భుతంగా పని చేసి పెను ప్రమాదాన్ని తప్పించడంలో సాహసోపేతంగా విశేష ప్రతిభ కనబరిచి కృషి చేసిన జిల్లా, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ లు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పోలీస్, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీస్ తదితర శాఖల అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా  సంబంధిత అధికారులకు  జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ప్రశంసా పతలు అందజేశారు.జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి, జెసి-3(సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, డిఆర్ఓ పుల్లయ్య లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ  డి.ఎస్.పి. వి.పోతురాజు గారు కూడా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు