తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్ మరణం కేసు విచారణ సిబిఐకి అప్పగింత: ముఖ్యమంత్రి ఫలణి స్వామి

తమిళనాడు: తూత్తుకుడిి జిల్లా శాతం కులం పోలీస్ స్టేషన్ లో జరిగిన తండ్రీకొడుకులు   జయరాజు(59), మరియు   బెన్ని క్స్(31)  పోలీస్ కస్టోడియల్ డెత్ పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. తమిళనాడు ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మరణాలను ఆమ్నెస్టీ  ఇండియా తీవ్రంగా ఖండించింది. కస్టోడియల్ మరణాల విషయంలో తమిళనాడు రెండో స్థానంలో ఉందని, లాకప్ లో  ఉన్న తండ్రి కొడుకు లపై పోలీసులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారని, ఇది మానవత్వానికి మాయని మచ్చ అని  ఆమ్నెస్టీ  ఇండియా పేర్కొంది.  కాగా ఈ కస్టోడియల్ మరణాల పై విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. “జూన్ 30న జరిగే తదుపరి విచారణలో తూత్తుకుడి కస్టోడియల్ డెత్ కేసును సీబీఐకి బదిలీ చేయడానికి మద్రాస్ హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటాము” అని ముఖ్యమంత్రి  ఫలణిస్వామి ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఇంతవరకు ఏ అధికారిని అరెస్టు చేయలేదు. లాక్ డౌన్ సమయం లో దుకాణాలు తెరిచి ఉంచారని ఆరోపణపై జయరాజు(59), మరియు అతని కుమారుడు  బెన్ని క్స్(31) లను తమిళనాడు పోలీసులు లాకప్ లో హింసించి చంపిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం అవుతున్న విషయం తెలిసిందే