
మైనర్ల వీడియోలను షేర్ చేసినందుకు 47 మంది అరెస్ట్
కేరళ : మైనర్ల అసభ్యకర వీడియోలను షేర్ చేసినందుకు, మరియు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసినందుకు కేరళ పోలీసులు దాదాపు 47 మందిని అరెస్టు చేశారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 110 చోట్ల పోలీసులు దాడి చేసి దాదాపు 143 ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో అనేకమది ప్రొఫెషనల్స్ మరియు ప్రభుత్వ డాక్టర్లు కూడా ఉన్నారు. వృత్తులతో సంబంధం లేకుండా అనేక మంది ముఠాలుగా ఏర్పడి కేరళ రాష్ట్రం కేంద్రంగా ఈ రాకెట్ నడుపుతున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు.