డోనాల్డ్ ట్రంప్ సలహాదారుని కి జైలు శిక్ష

 జార్జియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క చిరకాల మిత్రుడు మరియు సలహాదారు రోగర్ స్టోన్ ను  జూలై 14వ తేదీన కారాగారశిక్ష అనుభవించుటకు హాజరుకావాలని ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశించారు. ఏడు రకాల నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొన్న రోగర్ స్టోన్ కు ఫిబ్రవరిలో ఫెడరల్ కోర్టు మూడు సంవత్సరాల నాలుగు నెలల కారాగార శిక్ష విధించింది. కానీ వయోభారం  మరియు కరోనా వైరస్ విజృంభణ కారణంగా అతనికి విధించిన శిక్షను కొద్దికాలం పాటు వాయిదా వేసింది. గత ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిపై అవమానకరమైన ఈమెయిల్ లను పోస్ట్ చేసినందుకు మరియు ఇతర నేరారోపణల గాను రోగర్  స్టోన్ కు ఫెడరల్ కోర్టు ఈ శిక్ష విధించింది.