నడిరోడ్డుపై పెళ్లిళ్ళు: పెళ్లిళ్లకు వేదికగా మారిన కేరళ తమిళనాడు సరిహద్దు

కేరళ:కేరళ ఆరోగ్య శాఖ అధికారుల సూచన ప్రకారం మూడు జంటలు ముచ్చటగా నడిరోడ్డుపై ఒకటయ్యారు. వేదక్కని,  ముప్పరాజు మరియు సుఖన్య,  మణికందన్, మరియు కస్తూరి నిర్మల రాజు అనే ఈ జంటలు కేరళ మరియు తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్నప్పటికీ వారి గ్రామాలు కేరళ మరియు తమిళనాడు లో ఉండడం వలన  లాక్ డౌన్ నిబంధనల వల్ల అధికారులు వారిని రాష్ట్రాలు దాటి వెళ్లేందుకుఅంగీకరించలేదు. మామూలుగా ఎవరికి వారు పెళ్లి ఘనంగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ లాక్ డౌన్ నిబంధనల వల్ల కేరళ తమిళనాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పరిమిత సంఖ్యలో హాజరైన బంధువుల మధ్య నడిరోడ్డు లో వివాహం చేసుకోవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదని ఆ జంటల బంధువులు ఆశ్చర్యం వెలిబుచ్చారు.