గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలించిన కార్మిక సంఘాలు

కర్నూలు :(విభారె): ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం  నంద్యాల డివిజన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడు, ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం రవికుమార్ మహానంది మండలం గాజులపల్లె గ్రామం లోని గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలించారు.మండలం లోని గాజులపల్లె ఉపాధి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా పెండింగ్ లో ఉన్న గ్రామీణ ఉపాధి ఉపకారవేతనం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా ఉపాధి హామీ పనులు పొడిగించి గ్రామీణ ఉపాధి కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు