పెద్దలు అంగీకరించలేదని ఇద్దరు మైనర్ ప్రేమికుల ఆత్మహత్య

గుజరాత్: దాహోడ్ జిల్లా లోని దేవగడ్ భారియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక(15) మరియు ఒక బాలుడు(17)ఆత్మహత్య చేసుకున్నారు. వారిద్దరూ ఒక చెరువు గట్టున చెట్టుకు ఉరివేసుకొని ఉండగా గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక తండ్రి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం వలననే ఆ మైనర్లు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ పటేల్ తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మైనర్ల మృతదేహాలు వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. ముక్కుపచ్చలారని వయసులోనే ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకొని మరణించడం గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది.