సౌదీ అరేబియా: కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే యాత్రికులను హజ్ యాత్రకు అనుమతిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ సందర్భంగా హజ్ యాత్ర కోసము యాత్రికులు చెల్లించిన సొమ్ము ఏలాంటి కోతలు లేకుండా పూర్తిగా వాపస్ ఇవ్వబడుతుందని తెలిపారు. మామూలుగా హజ్ యాత్రజూలై ఆఖరి వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. సౌదీ అరేబియా దేశం ఏర్పడినప్పటి నుంచి గత 90 సంవత్సరాలలో మొదటిసారిగా హజ్ యాత్ర రద్దు చేయబడింది అని ఆదేశ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ రోజురోజుకు ప్రబలి పోతున్నందువలన యాత్రికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ అరేబియా తెలిపింది. అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా భారతదేశం కూడా హజ్-2020 యాత్రకు యాత్రికులను పంప కూడదని నిర్ణయించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు రెండు లక్షల 30 వేల మంది యాత్రికులు దరఖాస్తు చేసుకున్నారు. వారు చెల్లించిన పూర్తి మొత్తం తిరిగి చెల్లిస్తామని, అందులో ఎటువంటి కోతలు ఉండబోవని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పారు.