భారత్ – చైనాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తాం : ప్రకటించుకున్న డోనాల్డ్ ట్రంప్

ఓక్లహోమా(అమెరికా) : భారత మరియు చైనా దళాల మధ్య ఘర్షణ తరువాత , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను “చాలా పెద్ద సమస్య” గా అభివర్ణించారు. మరియు రెండు దేశాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారానికి తమ అధికారులు మంతనాలు జరుపుతున్నారనిి తెలిపారు. “మేము భారత్‌ మరియు చైనాలతో మాట్లాడుతున్నాము. వారిరువురి మధ్య చాలాపెద్ద సమస్య ఉంది. పరిస్థితిని గమనిస్తూ ఉన్నాము” అని ఓక్లహోమాలో తన మొదటి కోవిడ్ -19 ఎన్నికల ర్యాలీకి వెళ్లే మార్గంలో ట్రంప్ తన ప్రసంగంలో తెలిపారు.. అమెరికా పరిపాలన ఉన్నతాధికారులు ఇరు దేశాల వారితో ఫోన్ ద్వారా సంభాషించేందుకు ప్రణాళిక రూపొందుతోందని తెలిపారు. భారతదేశం మరియు చైనా మధ్య సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం చేసి ఉద్రిక్తతను తగ్గించడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ చెప్పాడు.