గీత దాటితే తాట తీస్తాం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ: జూన్ 15న చైనా సరిహద్దులో జరిగిన  ముఖాముఖి యుద్ధంలో 20 మంది భారత సైనికులు చనిపోయారు. దీనిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మిలిటరీ అగ్రశ్రేణి అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్ష జరిపారు. చైనా బలగాలు మితిమీరి ప్రవర్తిస్తే తగిన సమాధానం చెప్పేందుకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. “భారతదేశం సమస్యను తీవ్రతరం చేయకూడదనుకుంటుంది, కానీ చైనా నుండి ఏదైనా దుందుడుకు చర్య ఉంటే,  తగిన సమాధానం  ఇచ్చే స్వేచ్ఛ  దళాలకు  ఇవ్వబడింది” అని చర్చల గురించి వర్గాలు తెలిపాయి.