
కర్నూలు:(విభారె న్యూస్): నగరంలోని స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారి చేతుల మీదుగా 40వేల రూపాయలు సీ.యం రిలీఫ్ ఫండ్ క్రింద చెక్ ను బాధితులకు అందజేశారు. 5వార్డుకు చెందిన మున్నా గారి తనయుడు పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతూ సరైన చికిత్స చేయించలేక ఆర్థిక సహాయ నిమిత్తం ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారిని కోరడం జరిగింది. ఈయన పరిస్థితి విన్న ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు ప్రభుత్వం నుంచి సీ.యం.రిలీఫ్ ఫండ్ నుండి ఆ బాధితుడికి సహాయంగా 40వేల రూపాయలు విడుదల చేయించి ఆ చెక్ ను వారికి అందజేశారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు 5వార్డు మాజీ కార్పొరేటర్ దండు శేషు యాదవ్ మరియు అక్బర్ పటేలా, వెల్లంపల్లి శ్రీవినివాసులు, అబ్దుల్హ మహబూబ్, వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు