కోల్కతా: జూలై 1 నుంచి కాళిఘాట్ ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి.జూన్ 1 నుండి ప్రభుత్వం ప్రార్థనా స్థలాలను తెరవడానికి అనుమతించినప్పటికీ, పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ఆలయాన్ని తిరిగి తెరవకూడదని, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కలిఘాట్ ధర్మకర్తలు నిర్ణయించారు.కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కాళికాలయం మూసివేయబడి మూడు నెలలు దాటింది. జులై 1 నుండి కాళికాలయం తెలిసినప్పటికీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నియమానుసారం భక్తులు సామాజిక దూరం పాటించాలని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఒకేసారి కేవలం పది మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. భక్తులందరూ తప్పనిసరిగా చేతి తొడుగులు ధరించాలి. లేకుంటే అనుమతించబడరు.ఆలయంలోకి ప్రవేశించే ముందు సందర్శకులకు శానిటైజర్లు అందించబడతాయి. ముసుగులు, చేతి తొడుగులు ధరిస్తే భక్తులకు అనుమతి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల అంతరం ఉండాలి, ” అని ఆలయ ధర్మకర్తలు వివరించారు.