అనుమతి లేకుండా కరోనా రోగికి చికిత్స: కేసు నమోదు చేసిన అధికారులు

గోరఖ్‌పూర్: కోవిడ్ రోగికి అనుమతి లేకుండా చికిత్స చేసినందుకు నర్సింగ్ ఇంటి యజమానిపై కేసు నమోదు చేశారు. జూన్ 17 న పరిస్థితి విషమంగా ఉండటంతో 39 ఏళ్ల  రైతును మహారాజ్‌గంజ్ జిల్లా నుంచి గోరఖ్‌పూర్ నర్సింగ్ హోమ్‌కు తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. అతను మూడు రోజులు నర్సింగ్‌లోనే ఉన్నాడు. వైద్య అధికారులు ఈ నర్సింగ్ హోమ్ పై దాడి చేసి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. కరోనారోగులకు చికిత్స చేసేందుకు ఈ నర్సింగ్ హోమ్ కు అనుమతి లేదని, అనుమతి లేకుండా చికిత్స చేయడం నేరమని అందుకే ఆస్పత్రి  స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.నర్సింగ్ హోమ్ సిబ్బంది, యజమానిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవి కుమార్ రాయ్ తెలిపారు.