
ఆళ్లగడ్డ:(విభారె న్యూస్):ఆళ్లగడ్డ పట్టణంలోని ఎల్.ఎం. కాంపౌండ్ లో
2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎల్.ఎం. కాంపౌండ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి లారీ డ్రైవర్ గా పని చేయుచున్నాడు. అతను ఈ మధ్య కాలంలో వృత్తిలో భాగంగా హైదరాబాద్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఈమధ్య అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కొరకు నంద్యాల శాంతి రామ్ ఆసుపత్రికి వెళ్లగా అనుమానించిన ఆసుపత్రి సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో కరోనా పాజిటివ్ గా వచ్చింది. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అతని వెంట సహాయకునిగా వెళ్లిన అతని కుమారునికి కూడా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. వారిద్దరిని కర్నూలు స్టేట్ కోవిడ్ హాస్పిటల్ కు తరలించినట్లు తెలిసింది. వారి కుటుంబ సభ్యుల రక్త నమూనాలు కూడా సేకరించి పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిసింది. ఈ వార్త ఆళ్లగడ్డ పట్టణంలో సంచలనం రేపింది. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకుండా గ్రీన్ జోన్ లో ఉన్న ఆళ్లగడ్డ పట్టణము ఒక్కసారిగా రెడ్ జోన్ లోకి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. కనుక ఆర్లగడ్డ పట్టణం వాసులంతా కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు.