
జెనీవా: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి అత్యంత ప్రమాదకర దశకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గురు శుక్ర వారాల మధ్య లక్షా 50 వేల కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సంస్థ చీఫ్ టెడ్రెస్ అధనోమ్ తెలిపారు. వీటిలో సగానికి పైగా కేసులు రెండు అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనే నిర్ధారణ అయినట్లు అధనోమ్ తెలిపారు.‘ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డయిన కేసుల్లో ఇదే అత్యధికమని ఆయన పేర్కొన్నారు.
ఈ మహమ్మారిని అరికట్టాలంటే నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందేనని టెడ్రోస్ అధనోమ్ తేల్చి చెప్పారు. కానీ, వైరస్ వ్యాప్తి మాత్రం అంతకంతకూ పెరుగుతోందన్నారు. మాస్కులు ధరించడం మరియు భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వంటి నియమాల్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పారు.