డ్రోన్ సహాయంతో పాక్ ఆయుధ రవాణా: తిప్పికొట్టిన భారత సైన్యం

కథువా:భారత దేశం పై ఎన్ని కుట్రలు చేసిన కుయుక్తులు పన్నినా కూడా పాకిస్థాన్ కు ఎప్పుడూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పాక్  కుట్రలను‌ మనభద్రతా దళాలు మరోసారి తిప్పికొట్టాయి. భారత్ ను దొంగదెబ్బ తీయాలని పాక్‌ చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ఫలించవని భారత భద్రతా  దళాలు రుజువు చేశారు. ఈ దినం తెల్లవారుజామున 5.10 గంటల సమయంలో జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా పన్సార్‌ చెక్‌పోస్టు వద్ద అనుమానాస్పదంగా ఎగురుతున్న పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ ను  గమనించిన బీఎస్ఎఫ్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమై కూల్చివేశారు. కూల్చివేసే సమయానికి డ్రోన్‌ భారత  భూ భాగంలోకి 250 మీటర్ల మేర చొచ్చుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ ను కూల్చేందుకు

తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. అనంతరం డ్రోన్‌కు అమర్చిన రెండు మ్యాగజిన్లు, అత్యాధునిక రైఫిల్‌, 60 రౌండ్ల తూటాలు, 7 గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలాన్ని సందర్శించి  దర్యాప్తు చేపట్టారు. డ్రోన్‌ సాయంతో ఆయుధాల రవాణాకు ప్రయత్నించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. డ్రోన్‌ను పాక్‌ రేంజర్లు నియంత్రించారని అధికారులు గుర్తించారు. కథువా జిల్లాలో భద్రతా బలగాలుఈఘటనతో  మరింత అప్రమత్తమయ్యాయి.