హమీద్ మృతికి ఎపిడబ్ల్యూజేఎఫ్ సంతాపం

కర్నూలు:( విభారె న్యూస్ ):ప్రజాశక్తి సీనియర్ సబ్ ఎడిటర్, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హమీద్ మృతి పట్ల ఎపిడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ  కర్నూలు జిల్లా కమిటీలు శనివారం ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపాయి. విజయవాడ లో ప్రస్తుతం ప్రజాశక్తి లో సీనియర్ సబ్ ఎడిటర్ గాపనిచేస్తూ అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందాడని, హమీద్ మృతి ఫెడరేషన్ ఉద్యమానికి తీరని లోటని ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఎపిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. మద్దిలేటి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.బి శ్రీనివాసులు, బి గోరంట్లప్ప ఏపీబీజేఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. జి ప్రసాద్ లు   అన్నారు. ఫెడరేషన్ ఉద్యమ నిర్మాణంలో అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు. విజయవాడలో జర్నలిస్ట్ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. హమీద్ ఆకస్మికంగా మృతి చెందడం భాధను కల్గిస్తుందన్నారు. అయన కుటుంబ సభ్యులకు ఫెడరేషన్, ఏపీబీజే ఏ  కర్నూలు జిల్లా కమిటీలు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు.