
కర్నూల్ :(విభారె న్యూస్):మాస్క్ ధరించకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతి లేదని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. బయట తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలి లేదంటే భారీగా జరిమానా విధిస్తామని అన్నారు . అన్ని బహిరంగ ప్రాంతాల్లో, దుకాణాల వద్ద కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. చేతులను సబ్బుతో లేదా సానిటైజర్ తో తరచూ శుభ్రం చేసుకోవాలి.కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ కోరారు. మాస్క్ ధారణపై పట్టణంలోని ప్రతి వీధిలో, గ్రామాల్లో ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి కరోనా వైరస్ నివారణపైకలెక్టర్ వీరపాండియన్ పలు సూచనలు చేశారు.