నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేసిన గోరంట్ల శకుంతల..

కర్నూలు:(విబారె న్యూస్) : నిరుపేదలకు, అనాధలకు సేవ చేయడంతోపాటు వారికీ సాయం చేయడంలోనే సంతృప్తి ఉంటుందని రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యురాలు గోరంట్ల శకుంతల అన్నారు. మంగళవారం తన కుమార్తె యామిని పుట్టినరోజు సందర్బంగా నగరంలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న డంపు యార్డ్ ప్రాంతంలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు కూరగాయలు తన కూతురు యామిని చేతులు మీదుగా పంపిణీ చేయించారు. అనంతరం శకుంతల మాట్లాడుతూ పుట్టిన రోజులు కేవలం తమ కుటుంబ సభ్యుల మధ్య నే కాకుండా పేదల మధ్య జరుపుకోవాలన్నారు. పుట్టినరోజు వేడుకలకు డబ్బులు వృధా చేయకుండా, ఆ పేరుమీద పేదలకు నిత్యావసర సరుకులు, వారికీ అవసరమైన వస్తువులు పంపిణీ చేయడం ద్వారా వారి కుటుంబాల్లో ఆకలి తీర్చిన వారం అవుతామన్నారు. అంతకుముందు అశోక్ నగర్ లోని నిరాశ్రయ వసతి గృహంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలను యామిని ఘనంగా జరుపుకున్నారు.