అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈరోజు శాసనసభలో వరుసగా రెండోసారి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో పై చేయి సాధించామని, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దిగజారకుండా చూశామని ఆర్థిక మంత్రి తెలిపారు. పేదరికంలో ఉన్న పేద ప్రజలను ఆర్థికసాయం ద్వారా పైకి తీసుకు రావాలని, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ కు కొత్త రూపం తేవాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు పెను సవాళ్లుగా మారాయని వివరించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని వృధా చేసిందని, అలాంటి విధానాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని స్పష్టం చేశారు.బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789.18 కోట్లు, రెవెన్యూ వ్యయం అంచనారూ.1,80,392.65కోట్లు, మూల ధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు, వ్యవసాయానికి రూ.11,891 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా రూ.3,615 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు,
విద్యకురూ.22,604 కోట్లు, మైనార్టీల సక్షేమానికి రూ.1998 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు, కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు, వైద్య రంగానికి రూ.11,419కోట్లు,
ఆరోగ్యశ్రీ కి రూ.2,100 కోట్లు, కేటాయించారు.