ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి

కర్నూల్:(విబారె న్యూస్):జిల్లాలోని తుంగభద్రనదికి నవంబర్ 20 వ తేది నుండి డిసెంబర్ 1 వ తేది వరకు పుష్కరాలు రానుండడంతో భక్తుల సౌకర్యార్ధం నది పరివాహక ఘాట్ల వద్ద ఏర్పాట్ల పై ప్రతిపాదనలు , అక్కడి పరిసరాలను, రహదారులను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు మంగళవారం పరిశీలించారు.ఆయా పోలీసుస్టేషన్ పరిధులలోని సర్కిల్ ఇన్ స్పెక్టర్ లకు జిల్లా ఎస్పీ గారు పలు ఆదేశాలు , సూచనలు తెలియజేశారు. పంచలింగాల ఘాట్, కర్నూలు సుంకేసుల రోడ్ మాసమసీద్ దగ్గర ఉన్న పంప్ హౌస్, అమీర్ హైదర్ ఖాన్ నగర్ , సంకల్ బాగ్ ఘాట్ ల దగ్గర పుష్కరాల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. జిల్లా ఎస్పీ గారి వెంట కర్నూలు రెండవ పట్టణ సిఐ శ్రీ మహేశ్వరరెడ్డి, కర్నూలు తాలుకా సిఐ శ్రీ ఓబులేషు, ఎస్సై లు ఉన్నారు.