గుజరాత్ లో భూకంపం

గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలోని , కచ్, అహ్మదాబాద్, సౌరాష్ట్ర,  రాజ్‌కోట్ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి.రాజ్‌కోట్ కు 122 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా ఆదివారం రాత్రి 8.13 గంటల ప్రాంతంలో భూమి కంపించిన‌ట్టు అధికారులు తెలిపారు.భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ప్రాణ నష్టం,   ఆస్తి నష్టం  జరిగినట్లు సమాచారం ఏదీ లేదని అధికారులు తెలిపారు. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారని తెలిపారు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది.గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ  కచ్, రాజ్ కోట్, పఠాన్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ప‌రిస్థితిని సమీక్షిస్తున్నారు