కర్నూలు జిల్లాలో పోలీసు దాడులు

కర్నూలు: జిల్లాలో ఈరోజు లాక్ డౌన్  ఉల్లంఘనదారులపై పోలీసుల చర్యలు తీసుకున్నారు జిల్లాలోలాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన దుకాణదారులు మరియు ఇతర వ్యక్తులు మొత్తం 67 మందిపై     188, 269, 270, 271  ఐ.పి.సి సెక్షన్ల కింద 22 కేసులు నమోదు చేశారు. వీటితో పాటు రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై   మొత్తం 774 కేసులునమోదు చేసిరూ.2,82,590/-  ల ఫైన్ లు వేస్తూ చలానాలు జారీ చేశారు. 13 వాహనాలు సీజ్ చేశారు.  జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.అరెస్టులతో పాటు రూ.52,940/- ల నగదు,  2222  లిక్కర్ బాటిల్స్  213  లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.