ఓ ఎల్ ఎక్స్ మోసం

హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతులేకుండా పోతోంది. వారు ఎవరినైనా ఇట్టే బురిడీ కొట్టించి డబ్బు కాజేస్తున్నారు. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో నివసించే ఓ న్యాయవాది సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో పడి

రు1.5 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. తన ఇంట్లో ఉన్న పాత ట్రెడ్ మిల్ ను అమ్మేందుకు ఓ ఎల్ ఎక్స్ లో ప్రకటన ఇచ్చాడు. ప్రకటన చూసిన ఒక వ్యక్తి తాను సైనికోద్యోగి ని చెప్పి 10 వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు. నేరగాళ్లు అనేక సార్లు పంపిన క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయడం వలన తన గూగుల్ పే కు అనుసంధానించబడిన 3బ్యాంకు ఖాతాల్లోని ఒక లక్షా 50 వేల రూపాయలు కాజేశారు. న్యాయవాది ఫిర్యాదు పైపై కేసు నమోదు చేసుకున్న  సిటీ సైబర్‌ క్రైమ్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.