ముంబై:ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ మరో నటుడిని కోల్పోయింది. ఇర్ఫాన్ ఖాన్ మరియు రిషి కపూర్ కన్నుమూయడంతో దిగ్భ్రాంతి చెందిన బాలీవుడ్ ఇప్పుడు సుశాంత్ మరణముతో మరో సారీ షాక్ కు గురయింది. సుశాంత్ వయసు 34 సంవత్సరాలు. నటన పై ఉన్న మోజుతో మొదట చిన్నితెర పై తన నట జీవితాన్ని ప్రారంభించి 2013సంవత్సరంలో వెండితెరకు పరిచయం అయ్యాడు.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం తన బంద్రా నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అదనపు పోలీసు కమిషనర్ డాక్టర్ మనోజ్ శర్మ ధృవీకరించారు. ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు ఇంకా సూసైడ్ నోట్ దొరకలేదు అని ముంబై పోలీసులు తెలిపారు.