డోన్ : మునిసిపల్ కమిషనర్

కరోనా వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మునిసిపల్ కమిషనర్

డోన్ : (విభారె): కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనీ మునిసిపల్ కమిషనర్ కె యల్ యన్ రెడ్డి అన్నారు,  గత 45 రోజుల నుండి మన డోన్ పట్టనంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదు. అలాంటిది ఈరోజు డోన్ నగరం, కొండపేటలో పాజిటివ్ వచ్చినందున రెడ్ జోన్ పరిధిలో ఉందంటే అది కేవలం ప్రజల అజాగ్రత్త మాత్రమేనని కమిషనర్ అన్నారు. అధికారులు ఎన్ని రకాలుగా చెప్పినా కనీస జాగ్రత్తలు కూడా పాటించకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు.  హోటల్స్, గోబీ సెంటర్లు,  స్వీట్ షాప్స్… మొదలగు వాటిని తెరిచేందుకు పెట్టిన శ్రద్ధ నిభందనల మీద పెట్టలేదు.
ఇప్పటినుండి ప్రజలు అందరు మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం మరియు సామాజిక దూరం పాటించడం వంటి నిభందనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే పని వున్నా లేకున్నా  బహిరంగ ప్రదేశాలలో మరియు రోడ్డు మీద విచ్చల విడిగా సంచరిస్తూ నిభందనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసు కోవడం జరుగును. బాధ్యత రహితంగా వున్నాము కాబట్టే ఇప్పుడు మళ్లీ మన డోన్ పట్టణం రెడ్ జోన్ పరిధిలోకి వెళ్ళింది. కనుక జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని  కమిషనర్ హెచ్చరించారు.