తెరుచుకున్న ‘మలబార్ ‘ దుకాణాలు…!

హైదరాబాద్,జ్యోతిన్యూస్ : దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతూ అతి పెద్ద బంగారు, రిటైల్ వజ్రాల గోలుసు స్టోల్లో ఒటిగా గుర్తింపు పొందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మెన్ 

ఎంపి.అహ్మద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న తమకు చెందిన అన్ని దుకాణాల్లో విస్తృతమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. స్టోర్ స్థాయిలో డిస్బేటాప్స్,కుర్చీలు, తలుపులు, స్వైపింగ్ మిషీన్లు 

వంటి అన్నింటిని క్రమం తప్పకుండా శుభ్రపరుస్తున్నట్లు వివరించారు. ప్రతి కౌంటర్ లో సీటింగ్ ఏర్పాట్లు సామాజిక దూర నిబంధనలకు నుగుణంగా ఫ్లోర్ మార్కర్లతో మార్చడమైందన్నారు. అదే విధంగా వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి బిల్లింగ్ కౌంటర్లలో ఫ్లోర్ మార్కర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అమ్మకపు సిబ్బంది శరీర ఉష్ణోగ్రతలు ప్రతి రోజూ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వారు పని గంటల్లో తప్పనిసరిగా చేతి తొడుగులు, మసుగులు ధరిస్తారని వెల్లడించారు. క్రమం తప్పకుండా హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల కోసం ప్రవేశ ద్వారం వద్ద తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజేషన్ సదుపాయాన్ని ప్రవేశ పెట్టినట్లు వివరించారు. స్టోర్ లోపల,ప్రతి కస్టమర్ ముసుగు ధరించడం,సామాజిక దూప్రమాణాలను పాటించడం తప్పని సరి చేసినట్లు తెలిపారు. స్థానిక అధికారుల నుంచి వసరమైన అనుమతులు పొందిన తర్వాత ఎపీ, తెలంగాణలోని న్ని దుకాణాలను తెరిపించినట్లు వెల్లడించారు.