సందడి మొదలయింది రోడ్డెక్కిన బస్సులు

తెరుచుకుంటున్న షాపులు, సందడిగా మారుతున్న సముదాయాలు  

  • రోడ్డెక్కిన 50 శాతం బస్సులు
  • బస్టాండ్లకు చేరుకుంటున్న ప్రయాణికులు
  • గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మొదలైన చిరు వ్యాపారాలు
  • భౌతిక దూరం పాటిస్తూనే షాపింగులు
  • హైదరాబాద్లో క్యాబ్, ఆటోలను ఆశ్రయిస్తున్న జనం
  • టీ.ఆర్టీసీకి బస్సులు తిరగక రోజుకు రూ.14 కోట్ల నష్టం
  • సీట్లు ఉన్నంతవరకే ప్రయాణికులకు అనుమతి
  • సరి, బేసి సంఖ్యల ఆధారంగా షాపులకు అనుమతులు 

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నవ జీవనం మొదలైంది. 55 రోజుల లాక్ డౌన్ అనంతరం హైదరాబాదీలు.. మళ్లీ ఉత్సాహంతో రోడ్లపైకి వచ్చారు. సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వడంతో ఉద్యోగులు, కార్మికులు తమ విధులకు వెళ్తున్నారు. నగరంలో సాధారణ పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి రోడ్లపైకి వస్తున్నారు. అన్ని దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తున్నారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్తో శుభ్రం చేసుకుంటున్నారు. ఇక దుకాణాలకు సరి – బేసి విధానంలో అనుమతివ్వడంతో.. తమ దుకాణాలను శుభ్రం చేసుకునే పనిలో యజమానులు బిజీ అయిపోయారు. కంటైన్మెంట్ జోన్లలో తప్ప అన్ని ప్రాంతాల్లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వాణిజ్యపరమైన ఏరియాల్లో దుకాణాల యజమానులు, ఉద్యోగులతో సందడి నెలకొంది. ఉదయం 9 గంటలకే తమ విధుల్లో చేరిపోయారు. సికింద్రాబాద్, కోఠి ఏరియాల్లో చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ జీవనోపాధికి బాటలు వేసుకుంటున్నారు. రాజధానిలో ప్రజా రవాణా వ్యవస్థకు అనుమతి లేకపోవడంతో.. తమ పని ప్రాంతాలకు వెళ్లేందుకు క్యాబ్ లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు ఉద్యోగులు, కార్మికులు. కొందరైతే తమ స్నేహితుల వాహనాల్లో వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ నియంత్రణ చర్యలను పాటిస్తున్నారు. నగరంలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలు, మోండా మార్కెట్, రాణిగంజ్, జనరల్ బజార్, బైబిల్ హౌస్, ఎడ్లీ రోడ్డు ప్రజలతో కళకళలాడుతోంది. సంగీత్ జంక్షన్, ప్యాట్నీ సెంటర్, ప్యారడైజ్ సర్కిల్, రాణిగంజ్ తో పాటు లక్షీకాపూల్, మాసాబ్ ట్యాంక్, పంజాగుట్ట సర్కిల్ లో వాహనాల రద్దీ అధికంగా ఉంది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన లా డౌన్లో మార్చి 22 నుంచి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఇక ఇంతకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులను నడిపే విషయంలో ఇప్పటికే ఏపీ ఒక క్లారిటీకి వచ్చింది. ఇక తెలంగాణా తర్జన భర్జన పడుతుంది. ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తంగా మారిన వేళ అన్ని వ్యవస్థలను ట్రాక్ లో పెట్టాలని భావిస్తుంది తెలంగాణ సర్కార్ . ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసిన ప్రభుత్వం ముందు ఆర్టీసీ విషయంలో దృష్టి పెట్టింది . ఇప్పటికే కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్నా ఏపీ ప్రభుత్వం బస్సులు నడపాలని , తదనుగుణంగా బస్సుల సీటింగ్ మార్పు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఇక తాజాగా కేంద్రం కూడా దాదాపు అన్నిటికీ సడలింపులు ఇస్తూనే రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది . దీంతో ప్రజా రవాణా నిర్వహించాలా వద్దా అన్న అంశంపై తెలంగాణా సర్కారు కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. హైదరాబాద్ కంటైన్మెంట్ జోన్ తప్ప తెలంగాణలో మిగిలిన అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ప్రారంభించింది. అయితే తెలంగాణలో ఆర్టీసీ బస్సులను నడపాలా వద్దా అన్న అంశంపై అంతకు ముందురోజు ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇక ఈ సమావేశంలో లాక్ డౌన్ నాటి నుండి ఆర్టీసీ పరిస్థితి , ఇప్పుడు బస్సులు నడిపితే ఎలా ఉంటుంది అన్న దానిపై చర్చించారు . దాదాపు బస్సులు నడపాలనే నిర్ణయానికి అందరూ మద్దతు తెలిపారు. చివరకు అధికారులు బస్సుల నడపటానికే నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆర్టీసీ బస్సులు నడిపించాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయానికి వచ్చారు. రోజుకు రూ. 14 కోట్ల నష్టం .. భర్తీ కి బస్సులు నడపాలంటున్న అధికారులు అయితే, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై, అటు ఆర్టీసీ అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో నివేదిక సమర్పించనున్నారు మంత్రి పువ్వాడ. లా డౌన్లో ఇప్పటికే రోజుకు రూ. 14 కోట్ల నష్టాన్ని ఆర్టీసీ చవిచూడాల్సి వచ్చిందని.. ఇప్పుడు కనీసం పాయింట్ టూ పాయింట్ బస్సులు నడిపిస్తే నష్టం కొంత పూడ్చు కోవచ్చనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది . అయితే, తిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకుంటూ, బస్సు సర్వీసులను నడపాలనే నిర్ణయానికి వచ్చారు. ఇక ఆర్టీసీ బస్సులు నడపటానికి సిద్ధం అంటుంది. ఇక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలో కూడా బస్సులు రైట్ రైట్ అంటూ ముందుకు కదులుతాయి. దేశంలో ప్రస్తుతం నాలుగో విడత లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. ఈ లాక్ డౌన్ లో అనేక సడలింపులు ఇచ్చారు. దాదాపుగా అన్నింటికీ అనుమతి ఇచ్చారు. మే 31 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటున్న సంగతి తెలిసిందే. 600 కేసులు ఉన్న సమయంలో దేశంలో లాక్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు లక్ష దాటిపోయింది. రోజుకు 5వేల కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నది. మరోవైపు సడలింపులు కారణంగా ప్రజలు రోడ్డుమీదకు వస్తున్నారు. సాధారణ జన జీవితం మొదలైంది. సాధారణ జన జీవనం మొదలయ్యాక సామాజిక దూరం పాటించాలి అంటే కుదరని పని. ఎందుకంటే ఒక ఆఫీస్ లో పనిచేసే వ్యక్తులు ఏదొక విషయంలో కలిసి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే విధంగా బిల్డింగ్ నిర్మాణ రంగంలో కూలీలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆటో, క్యాబులకు కూడా అనుమతి ఇచ్చారు. ఆటోలో ఇద్దరు ప్రయాణం చెయ్యొచ్చు. ఇద్దరి మాత్రమే అనుమతి ఇచ్చినా… మన దేశంలో అది సాధ్యం అవుతుందా అంటే లేదని చెప్పాలి. లాక్ డౌన్ విధించి ఇంట్లో కూర్చోపెడితేనే కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు బయటకు వదిలేశారు. కేసులు పెరగవు అనే గ్యారెంటీ లేదు. ఇందుకు ఉదాహరణ దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలు. లాక్ డౌన్ సడలించి తిరిగి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించారు. సోమవారం నుంచి సడలించిన దాని ఫలితాలు మరో 14 రోజుల్లో కనిపించే అవకాశం ఉన్నది. ఒకవేళ 14 రోజుల తరువాత ఈ కేసులు భారీగా పెరిగితే అప్పుడు కూడా సడలింపులను ఇలానే కొనసాగిస్తారా లేదంటే ఆంక్షలు కఠినం చేస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది. ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పినట్టుగా జూన్ జులై నెలల్లో ఇండియాలో కరోనా పీక్ స్టేజిలోకి వెళ్తుంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జూన్ 1 నుంచి ఇండియాలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం. లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో తెలంగాణలో వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో సందడి షురువైంది. నెలన్నర రోజులుగా పూర్తిగా నిర్మానుష్యంగా మారిన ప్రధాన వ్యాపార కూడళ్లలో క్రమంగా రద్దీ ప్రారంభమైంది. ప్రధాన పట్టణాల్లోని మార్కెట్లలో జన జీవనం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోంది. జిల్లాల వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం ‘ఎ’ కేటగిరి పరిధిలో ఉండే మెడికల్ షాపులు, కిరాణ, పాలు, కూరగాయల వంటి షాపుల్లో మాత్రమే లావాదేవీలు జరిగాయి. తాజాగా సడలించిన ఆంక్షలతో ‘బి’ కేటగిరి పరిధిలోని వ్యాపార, వాణిజ్య సంస్థల్లో మంగళవారం నుంచి షరతులతో కూడిన లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రధానంగా బట్టల షాపులు, సిమెంట్, స్టీలు, ఇతర భవన నిర్మాణ మెటీరియల్ షాపులు అక్కడక్కడా తెరుచుకున్నాయి. ఆటోమోబైల్ షాపులు కొన్ని తెరుచుకున్నాయి. మాస్కులు ధరించి బయటకు వస్తున్న ప్రజలు భౌతిక దూరం పాటించడంలో మాత్రమే అదే అలసత్వాన్ని ప్రదర్శించారు. ‘సి’ కేటరిగిలోకి వచ్చే సినిమా హాళ్లు, బార్లు, విద్యా సంస్థలు, టళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతి లేదు. హేర్ కటింగ్ సెలూన్లు అరకొరగా హీరకటింగ్ సెలూన్లు తెరిచేందుకు నాయిబ్రాహ్మణులు ఆంగీకరించలేదని కొన్ని జిల్లాలలో మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సంస్థల్లో సేవలందించాలంటే తప్పనిసరిగా వినియోగదారులను తాకాల్సి ఉంటుంది. దీంతో భౌతిక దూరం పాటించడం ఏ మాత్రం వీలు కాదు. దీంతో మరికొన్ని రోజులు హేర కటింగ్ సెలూన్లను మూసి ఉంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. షురువైన రిజిస్ట్రేషన్లు.. ఆర్టీఏ సేవలు… లా డౌన్లో పూర్తిగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు, ఆర్టీఏ కార్యాలయాల్లో దైనందిన కార్యకలాపాలు పున:ప్రారంభమయ్యాయి. అన్ని జిల్లాల వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు రెండు, మూడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఆర్టీఏ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. డ్రైవింగ్ లైసెన్సులు, వాహన ఫిట్నెస్, ఎల్ ఆర్, రిజిస్ట్రేషన్ల వంటి సేవలు కొన్ని ప్రారంభయ్యాయి. మీసేవా కేంద్రాలు కూడా పని చేస్తున్నాయి. ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యాకలాపాలు పుంజుకున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో షురూ కాని ఓపీ సేవలు.. లాక్ డౌన్ సమయంలో కేవలం అత్యవసర వైద్య సేవలందించిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు కొన్ని ప్రాంతాలలో ప్రారంభం కాలేదు. కేవలం గర్భిణు వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవల అంశంపై జిల్లా వైద్యారోగ్యశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంటి నంబర్ చివరి సంఖ్య ప్రకారం.. మున్సిపల్ లైసెన్సులు పొందిన వ్యాపార, వాణిజ్య సంస్థలు, బీ కేటగిరి పరిధిలోకి వచ్చే వ్యాపార సంస్థలు రోజుకు 50 శాతం షాపులను మాత్రమే తెరిచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆయా సంస్థల ఇంటి నెంబరు చివరి అంకె సరి సంఖ్య ఉంటే సరిసంఖ్య తేదీల్లోనే షాపులు తెరవాలి. ఇంటి నెంబరు బేసి ఉంటే బేసి సంఖ్య తేదీల్లోనే షాపులు నడపాలి. అలాగే షరతులతో కూడిన లా వాదేవీలు జరగాలని ఆయా జిల్లాలలో మున్సిపల్ అధికారులు ఆ దేశాలు జారీ చేశారు. భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా చేసి, మాస్కులు ఉంటేనే లోపలికి అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. అలాగే సానిటైజర్, హ్యాండ్ వాష్ వంటి సౌకర్యాలు కల్పించాలని షరతులు విధించారు. ఈ మేరకు నగరంలోని బట్టల వర్తక సంఘం, గోల్డ్ మర్చంట్స్ వంటి అసోసియేషన్లతో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ సమావేశాలు నిర్వహించి లాక్ డౌన్ ఆదేశాల మేరకు నడుచుకోవాలని అవగాహన కల్పించారు. ఆర్మూర్, బోధన్, భీమ్ గల్ మున్సిపాలిటీల్లో వ్యాణిజ్య సంస్థల సంఖ్య కాస్త తక్కువగా ఉండటంతో అక్కడ ఆయా సంస్థలకు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా నెంబర్లు కేటాయించి.. సరి, బేసి విధానంలో రోజు విడిచి రోజు షాపులు తెరిచేలా ఏర్పాట్లు చేశారు.