నీ దర్శనభాగ్యం ఎప్పుడు స్వామీ..?
- 47 రోజులుగా లాక్ డౌన్ లో శ్రీవారి దేవాలయం
- నిర్విరామంగా సాగుతున్న ఏకాంత సేవలు
- 530 కోట్ల రూపాయలు కోల్పోయిన ఆదాయం
- మద్యం షాపులకు లేని నిబంధనలు మందిరాలకా..?
తిరుపతి,జ్యోతి బ్యూరో : ఆపద మొక్కులవాడా…ఓ వెంకటేశా….నీ దర్శన భాగ్యం ఎప్పుడు స్వామీ…వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నీ భక్తులకు ఎప్పుడు కనిపిస్తారయ్యా…. అంటూ అనాధ రక్షకుడు, ఆపద్భంధవున్ని పలువురు వేడుకుంటున్నారు.
ఎప్పుడూ చరిత్రలో మిగిలి పోయే విధంగా గత 47 రోజులుగా స్వామి దర్శనం లేకపోవడం గమనార్హం..ఈ
నేపథ్యంలో టీటీడీ దాదాపు 530 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోయింది. ఇందుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా స్వామి వారి చెంతకు రోజుకు వివిధ మార్గాల గుండా 70,000 నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చేవారు. స్వామి వారికి హుండీ ద్వారానే కాకుండా, తలనీలాలు, దర్శన టికెట్లు, లడ్డులు, ఆర్జిత సేవలు ఇతరత్రా రూపాల్లో రోజుకు 10 నుంచి 15 కోట్లు ఆదాయం వచ్చేది..
కానీ కంటికి కనిపించని వైరస్ మహమ్మారి పుణ్యమా.. అని పాపాలు తొలగించి మంచిని ప్రసాధించేందుకు స్వామి వారు వైరస్ రూపంలో ప్రజలను వణుకు పుట్టిస్తున్నాడు. ఇప్పటికైనా ధర్మం ఆచరించి పాప కర్మాలు విడిసి పెడతారని స్వామి వారి భావన.
కానీ దేశంలో పాపాలు పెరిగి స్వార్థ చింతన విడవనంత వరకు ఇలాంటి వైరస్ లు వెంటాడుతూనే వుంటాయన్న విషయాన్ని ప్రజలు గమనించాలి..లాక్ డౌన్ కాదు.పాపాలు, కర్మాలు లాక్ డౌన్ కావాలి…అప్పుడే పుణ్యం ప్రపంచాన్ని ఆవరించి ప్రజలు సుఖ శాంతులతో
వుండగలుగుతారు.47 రోజులుగా శ్రీ వారి దర్శనం లేకపోవడం మొత్తం దేశాన్ని కలవర పెదుతుంది.
అలుముకున్న నిషబ్ధం… ఎప్పుడూ వాహన రాకపోకలు, భక్తుల గోవిందా నామస్మరణలతో మారు మోగే తిరుమల, తిరుపతిలో నిశబ్దం అలుముకుంది. ఘాట్ రోడ్లు వాహనాలు లేక బోసిపోతున్నాయి.. మొత్తం కొండ నిర్మానుష్యంగా మారింది..చూడాలన్న భక్తులు కనిపించడం లేదు…అయితే శ్రీ వారికి నిత్యం ఏకాంత సేవలు యధావిధిగా కొనసాగుతున్నాయి..లోక శాంతి కోసం యజ్ఞ, యాగాదులు జరుగుతున్నాయి..నడక దారులు, ఘాట్ రోడ్లు పూర్తిగా మూసి వేశారు..ఆలయం ముందు బారికేడ్లు పెట్టారు..అర్చకులు మాత్రమే మూలవరాటు స్వామి వారి వద్దకు వెళ్లి పూజలు, కైంకర్యాలు చేస్తున్నారు..ఈ
నేపథ్యంలో లాక్ డౌన్ ఈ నెల 17 తో ముగుస్తుందో….పొడిగిస్తారో వేసి చూదాల్చి ఉంది…పొడిగిస్తే మాత్రం ఇంకా ఎన్ని రోజులు స్వామి వారి దర్శన భాగ్యం ఉండదో.. అంటూ పలువురు భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.. మద్యం షాపులకు లేని నిబంధనలు మందిరాలకా..? ప్రభుత్వం లాక్ డౌన్ వేళా ప్రజలకు సవాలక్ష నిబంధనలు పెట్టి ఎడిపిస్తున్న విషయం తెలిసిందే… దాదాపు 38 రోజుల విరామం అనంతరం ప్రభుత్వం ఆదాయం పేరుతో నిబంధనలు సైతం తుంగలో తొక్కి రాష్ట్ర వ్యాప్తంగా
మద్యం షాపులను తెరిపించింది…ఇప్పుడు కరోనా సోకదా..? లేకుంటే ప్రభుత్వానికి కనిపించ లేదా..? వైన్ షాప్ ల వద్ద మందు బాబులు గుంపులు,గుంపులుగా చేరి లాక్ డౌన్ నిబంధనలను బ్రేక్ చేస్తున్నారు…పోలీసులు,
జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు…దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందనప్పుడు మందిరాలు తెరిస్తే వచ్చే నష్టం ఏమిటని
భక్తులు ప్రశ్నిస్తున్నారు…టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు, దేవాదాయ శాఖ
ఆధ్వర్యంలో ఉన్న ఆలయాలను తిరిగి ప్రారంభించాలచిన బాధ్యత ఉంది…లేకుంటే భక్తుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. 530 కోట్లు లోటు పూడ్చుకునే దిశగా కసరత్తు గత 47 రోజులుగా మూతపడిన శ్రీవారి ఆలయంలో కోల్పోయిన 530 కోట్లు ఆదాయం పూడ్చుకోవడానికి చైర్మన్ సుబ్బారెడ్డి కసరత్తు మొదలు పెట్టారు…దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు..రోజు వారీ ఆదాయం పెంచుకుని భక్తులను నిర్ణీత సంఖ్యలో అనుమతించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు..స్వామి సేవ ఎలా చేయాలి..? భక్తులకు దర్శనం ఎలా కల్పించాలి..? భౌతిక దూరం ఎలా పాటించాలి.. అనే దిశగా చర్యలు మొదలు పెట్టారు. అయితే స్వామి వారి భాగ్యం ఎప్పుడు ఉంటుందో వేచి చూడాల్సి ఉంది..ఈ నెల 17 తర్వాత దర్శన భాగ్యం ఉంటుందని భక్తులు భావిస్తున్నారు