వాట్సాప్‌ స్టేటస్‌ వీడియో నిడివి కుదింపు

30 నుంచి 15 సెకన్లకు తగ్గించిన ఇన్‌స్టంట్‌ మెసెంజర్‌ వాట్సాప్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంటర్నెట్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వీరిలో కొంతమంది వర్క్‌ ఫ్రం హోమ్‌ లేదా ఇతర పనుల్ని చక్కబెట్టుకోవడానికి ఆన్‌లైన్‌ని వినియోగిస్తుంటే మరికొంతమంది కాక్షేపం కోసం నెట్‌ని తెగ వాడేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్‌ వేగం తగ్గిపోయింది. ఈ పరిణామా నేపథ్యంలో ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసెంజర్‌ వాట్సాప్‌ కీక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 30 సెకన్లుగా ఉన్న స్టేటస్‌ వీడియో నిడివిని 15 సెకన్లకు కుదించింది. ఈ విషయాన్ని వాబీటాఇన్‌ఫో వ్లెడిరచింది. ఇది ఇండియన్‌ యూజర్లకు మాత్రమే వర్తించనుంది.
ఇంట్లో ఖాళీగా ఉంటున్న నెటిజన్లు వాట్సాప్‌ స్టేటస్‌లో విపరీతంగా వీడియోు అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీంతో సర్వర్లపై భారం పడుతోంది.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే నెట్‌ని అధికంగా వినియోగించడం వ్ల వేగం కూడా తగ్గుతుందని.. ఇతర ముఖ్యమైన పను నిర్వహించుకోవడానికి ఇది అడ్డంకిగా మారే అవకాశం ఉండడం కూడా మరో కారణమని తొస్తోంది. ఇప్పటికే నెట్‌ వినియోగం పెరగడంతో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సైట్లు, యాప్‌ు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వీడియో, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వీడియో స్ట్రీమింగ్‌ క్వాలిటీని తగ్గించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం దేశంలో 21 రోజు పాటు లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి విదితమే.