మరింత పతనానికి బ్యాంకింగ్‌ వ్యవస్థ

మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మిస్తున్న వారు అనేకమంది అప్పులవలయంలో చిక్కుకుపోతున్నారు. స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల 2020-21 ఆర్థిక సంవత్సరంలో మరింత పడిపోతుందని నిపుణుల అంచనా. బ్యాంకింగ్‌ రంగం సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి లేదని యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ మూంగా మార్కెట్‌ మరింత తీవ్రంగా దెబ్బతినడం ఖాయం. ప్రధాని మోదీ దృష్టి ఈ మహమ్మారిపై కంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలా అన్న అంశంపైనే కేంద్రీక ృతమయింది. సంపద పెంచుకోవడం మాట దేవుడెరుగు, ఉన్న సంపద హరించుకుపోకుండా చూడడం ఎలాగో అర్థం కాని పరిస్థితి ఏర్పడిరది.
దేశంలో ఏదో జరుగుతున్నట్లు కనిపించాంటే పార్లమెంటు సమావేశాు సాగుతున్నట్లు కనిపించాని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడుతున్నారా? అందుకేనేమో ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అట్టుడికి పోతుండగా, పార్లమెంటు సమావేశాను యథా ప్రకారం ఏప్రిల్‌ 2 వరకు జరిపించాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నట్లు వార్తు వస్తున్నాయి. నిజానికి పార్లమెంటు ఉభయ సభల్లో ఢల్లీి అ్లర్లపై జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జవాబిచ్చిన తర్వాత ఆసక్తికరమైన కార్యకలాపాలేమీ జరగలేదు. వివిధ మంత్రిత్వ శాఖ పద్దుతో పాటు మొత్తం ఆర్థిక పద్దు ఆమోదం కూడా లాంఛనంగా జరిగిపోయింది. ఇక ఏ క్షణంలోనైనా పార్లమెంటును వాయిదా వేసి తమను స్వస్థలాకు పంపిస్తారేమోనని పువురు ఎంపీు భావిస్తుండగా, ప్రధాని మాత్రం ససేమిరా అంటున్నారని తొస్తోంది. కరోనా వైరస్‌ కారణంతో పార్లమెంటును వాయిదా వేస్తే మధ్యప్రదేశ్‌లో ఈ వైరస్‌ బూచితో విశ్వాస పరీక్ష జరపకుండా స్పీకర్‌ సభను వాయిదా వేయడం సరైనదేనని ఒప్పుకోవాల్సి వస్తుందేమోనని బిజెపి పెద్దు భయపడుతున్నట్లు కనపడుతోంది. నిజానికి పార్లమెంటుకు హాజరవుతున్న ఎంపీ సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. సెంట్రల్‌ హాుకు కూడా ఎంపీు రావడం తగ్గించేశారు. జనం రాకపోకల్ని కొన్ని గేట్లకే పరిమితం చేసి స్క్రీనింగ్‌ మొదు పెట్టారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా రోజులో అధిక భాగం ప్రత్యేక ప్రస్తావనకు అవకాశం ఇచ్చి ఎంపీు మాట్లాడేందుకు మీ కల్పిస్తున్నారు. సభలో అధిక సమయం గడిపేందుకు ప్రాధాన్యమిచ్చే రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సైతం ఇప్పుడు ఎక్కువ సేపు సభలో ఉండడం లేదు.
ఈ సమావేశాల్లో కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాు అకస్మాత్త్తుగా ఉభయ సభల్లో తమ వైఖరిని మార్చుకుని కీకమైన అంశాపై ప్రభుత్వాన్ని నిదీసే ప్రయత్నం చేయడం ఒక కొత్త పరిణామం. ఢల్లీి అ్లర్లు, పౌరసత్వ చట్టం వంటి అంశాపై పార్లమెంటును కొంతకాం స్తంభింప చేసిన ప్రతిపక్షాు ఆ తర్వాత ఇతర అంశాపై ద ృష్టి మళ్లించడం ప్రారంభించాయి. అస్తమానం మతపరమైన అంశాపై ప్రభుత్వాన్ని నిదీస్తే దాని వ్ల తమకే నష్టం కుగుతుందని వారు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల్లో అనేక అంశాపై ఐక్యత లేదు. భాషా సమస్యపై మంగళవారం కాంగ్రెస్‌ సభ్యు వాకాట్‌ చేసినప్పుడు త ృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యు కదకుండా కూర్చుని ఉండడం కనిపించింది. చాలా అంశాపై కాంగ్రెస్‌, డిఎంకెలో మినహా ఇతర ప్రతిపక్ష సభ్యుల్లో కదలిక కనపడడం లేదు. ఇక తెంగాణ రాష్ట్రసమితి, వైసీపీ పార్టీ సభ్యుకు తాము ప్రతిపక్షంలో ఉన్నామో, లేక అధికార పక్షంలో ఉన్నామో త్చేుకోలేని పరిస్థితి కనపడుతోంది. దేశంలో సంస్క ృత విశ్వవిద్యాయా బ్లిు గురించి రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ప్రాచీన భాషుగా గుర్తింపు పొందిన దక్షిణాది భాషకు జరుగుతున్న అన్యాయం గురించి కాంగ్రెస్‌ ఎంపి జైరాం రమేశ్‌, ఇతర దక్షిణాది ఎంపీు ప్రస్తావించగా ఈ బ్లిు అద్భుతమైనదని వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి ప్రశంసించారు. ఇక దక్షిణాది రాష్ట్రాపై హిందీ భాషను రుద్దడంపై మంగళవారం ఆ ప్రాంత ఎంపీ ఆందోళనతో రాహుల్‌ గాంధీ కూడా గొంతు కపగా, మన తొగు ఎంపిు మాత్రం ఏమీ జరగనట్లు కూర్చోవడం కనిపించింది! అంతర్జాతీయంగా చమురు ధరు తగ్గినా, మన దేశంలో మాత్రం వాటి ప్రయోజనాను సామాన్యుకు అందించకపోవడంపై కాంగ్రెస్‌, త ృణమూల్‌ ఎంపీు నిరసన వ్యక్తం చేసినప్పుడు అదేదో మనకు సంబంధించిన విషయం కాదన్నట్లు తొగు ఎంపిు వ్యవహరించడం గమనార్హం. బ్యాంకుకు వే కోట్లు ఎగ్గొట్టడంపై కాంగ్రెస్‌, ఇతర సభ్యు నిరసన తెలిపినప్పుడు కూడా వారు స్తబ్దంగానే ఉండిపోయారు. ప్రతిపక్షా ఐక్యత లేమివ్ల ఎంతటి తీవ్రమైన అంశాన్ని లేవనెత్తినా దానికి అంత ప్రాధాన్యత భించడం లేదు.
నిజానికి ఇటీవ రాహుల్‌ గాంధీ బ్యాంకు నుంచి భారీ రుణాు తీసుకుని ఎగగొట్టిన 50 మంది వివరాను ప్రశ్నించినప్పుడు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఇచ్చిన వివరాు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దేశంలో మొండి బాకీ మూంగా బాగా దెబ్బతిన్న బ్యాంకుల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అగ్రస్థానంలో ఉన్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రుణగ్రహీతు ఎగవేసిన మొత్తం రూ. 13,473 కోట్లు కాగా, భారత దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 13,432 కోట్ల మేరకు రుణాను వసూు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నది. దేశంలోని 18 ప్రభుత్వ రంగ బ్యాంకు, 9 ప్రైవేట్‌ రంగ బ్యాంకు వే కోట్ల అప్పు ఇచ్చి వాటిని మాఫీ చేయాల్సిన దుస్థితిలో ఉన్నాయి. గత డిసెంబర్‌ నాటికి బ్యాంకుకు రూ.9,58,167 కోట్ల మేరకు నిరర్థక ఆస్తున్నాయని ఆర్థిక మంత్రి తన జవాబులో చెప్పారు. అయితే, తన జాబితాలో యెస్‌ బ్యాంకును ఎందుకు చేర్చలేదో ఆయనకే తెలియాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడూ బ్యాంకుకు ఎంత మొత్తం ఎగ్గొట్టారో చెబుతుంది కాని ఎవరు ఎగ్గొట్టారన్న విషయాన్ని చెప్పేందుకు సంకోచిస్తుంది. సంపదను క్లొగొట్టే వారినే సంపద స ృష్టించే వారుగా ప్రభుత్వం భావించడమే ఇందుకు కారణం. అయితే మాజీ బిజెపి ఎంపి కిరీటి సోమయ్య మాత్రం యెస్‌ బ్యాంకు ఎగవేతదారు వివరాను వ్లెడిరచారు. ఇన్వెస్టర్స్‌ గ్రీవెన్స్‌ ఫోరమ్‌ సంస్థాపకుడైన కిరీటి సోమయ్య చెప్పిన వివరా ప్రకారం యెస్‌ బ్యాంకుకు దేశంలో మహా మహా సంపద సృష్టికర్తలే దాదాపు రూ. 60 వే కోట్ల మేరకు రుణాు బాకీ పడ్డారు. వారిలో రియన్స్‌ అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌ రు. 12,800 కోట్లు, ఎస్సెల్‌ గ్రూప్‌ రూ. 8400 కోట్లు, డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ రూ. 4735కోట్లు, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ రూ. 2500 కోట్లు, జెట్‌ ఎయిర్‌ వేస్‌ రూ. 1100 కోట్లు బకాయి ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే అనిల్‌ అంబానీ ప్రపంచంలో అతి పెద్ద బ్యాంకు అయిన ఇండస్ట్రియల్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాతో పాటు మరో మూడు బ్యాంకుకు 700 మిలియన్‌ డార్లు కట్టలేక తన గ్రూప్‌ నికర మివ ఏమీ లేదని చేతులెత్తేశారు. మరో ఆరు వారాల్లో ఆయన 100 మిలియన్‌ డార్లు కట్టాల్సిందేనని ఇటీవ ఒక ండన్‌ కోర్టు కూడా ఆదేశించింది. మరి రాఫెల్‌ యుద్ధ విమానాు తయారు చేసే దసో ఏవియేషన్‌ కంపెనీ అనిల్‌ అంబానీని భారత దేశంలో తన భాగస్వామిగా ఎలా ఎంచుకున్నదో ఆ కంపెనీకే తెలియాలి. రాహుల్‌ గాంధీకి ఇచ్చిన జవాబు ప్రకారం తానే రూ. 13,432 కోట్లు వసూు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఎస్‌బీఐ రూ. 60 వే కోట్ల మేరకు అప్పు వయంలో ఉన్న యెస్‌ బ్యాంకును కాపాడేందుకు ఆగమేఘాపై ఎందుకు రంగంలో దిగిందో, ఎవర్ని కాపాడేందుకు దాన్ని రంగంలోకి దించారో ఆ బ్యాంకు పెద్దలే చెప్పాలి. విచిత్రమేమంటే ఎవరి హయాంలో బ్యాంకు ఎక్కువ అప్పు వయంలో చిక్కుకుపోయాయో లెక్కు అన్వేషించేందుకు కాంగ్రెస్‌, బిజెపి పెద్దు త మునకలై ఉన్నారు కాని ఈ సంక్షోభాన్ని నివారించేందుకు మార్గాు ఎవరి వద్దా ఉన్నట్లు లేవు. ఇవాళ దేశంలో కంపెనీ లా ట్రిబ్యునల్‌, కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌, ఇతర కోర్టుల్లో ఉన్న పిటీషన్లను చూస్తుంటే దివాళా తీసి వే కోట్లు ఎగ్గొట్టేందుకు ఎన్ని సంస్థు సిద్ధంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఇన్‌ సాల్వెన్సీ అండ్‌ బాంక్రప్ట్సీ (ఐబి కోడ్‌) క్రింద గత ఏడాది వరకే రూ. 2,57,642 కోట్ల మేరకు బకాయిు ఉన్న 378 కంపెనీను తెగనమ్మేందుకు పిటిషన్లు దాఖయ్యాయి. ఐబీ కోడ్‌ కింద రుణదాత కమిటీ 270 రోజుల్లో పరిష్కారాన్ని ఆమోదించకపోతే కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆ కంపెనీని ఎంతో కొంతకు తెగనమ్మేందుకు ప్రయత్నిస్తుంది. గతంలో ఇలా అమ్మేందుకు రెండేళ్ల సమయం ఉండేది కాని ఇప్పుడు ఆ సమయాన్ని ఏడాదికే తగ్గించారు. దీని వ్ల కంపెనీ మివ తీవ్రంగా తగ్గిపోతోంది. ఐబి బోర్డ్‌ డాటా ప్రకారం 2019 డిసెంబర్‌ 31 వరకు 51 కంపెనీను తెగనమ్మడానికి (లిక్విడేషన్‌) ప్రయత్నిస్తే రూ. 9870 కోట్ల క్లెయిమ్‌కు గాను రూ. 96 కోట్లే వచ్చాయి. ఈ స్వ్ప మొత్తాన్నే అప్పిచ్చిన వారికి పంచిపెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం 551 లిక్విడేషన్‌ కేసు ద్వారా అప్పిచ్చిన వారు రూ. 4.47 క్ష కోట్లు ఆశిస్తుండగా, లిక్విడేషన్‌ మివ రూ. 22,147 కోట్లు మాత్రమే ఉండడం గమనార్హం. సంపద సృష్టిస్తారనుకున్న వారి సంపద మివ ఎంత పడిపోతుందో దీన్ని బట్టి అర్థమవుతోంది. మన ఆర్థిక మంత్రి మాత్రం దేశంలో వ్యాపార సంస్థు ఆర్థికాభివ ృద్ధికి తోడ్పడతాయని. ఉద్యోగాను పెంచుతాయని, సంపద ప్రవహించేలా చేస్తాయని అపారమైన నమ్మకంతో రకరకా చట్టానుంచి విముక్తి కల్పిస్తూ 76 రకా రాయితీను ఎడాపెడా ప్రకటించారు. అయినప్పటికీ దేశంలో సంపద కుదించుకుపోవడమో, స్తంభించిపోవడమో జరుగుతోంది కాని ప్రవహించే పరిస్థితి కనపడడం లేదు. ఇన్‌సాల్వెన్సీ కోడ్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన సవరణ మూంగా ఆమె ఆశించినట్టు పెట్టుబడిదారు విశ్వాసం పెరగకపోగా మరింత క్షీణించేందుకు ఆస్కారం కుగుతోంది.
దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో పార్లమెంటులో కొందరు ఎంపిు, మాజీ ఎంపిు తమ సంస్థ, తమకు తెలిసిన వారి సంస్థ బకాయి విషయంలో చేస్తున్న పైరవీను బట్టి అర్థమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సన్నిహితంగా మారితే తమ ఆర్థిక సమస్య నుంచి వారు కాపాడతారని, బ్లిుు త్వరగా వసూవుతాయని, కొత్త కాంట్రాక్టు భిస్తాయని భావించే వారు పెరిగిపోతున్నారు. ఈ దేశంలో మౌలిక సదుపాయా ప్రాజెక్టు చేసిన వారు అనేకమంది అప్పు వయంలో చిక్కుకుపోతున్నారు. దేశంలో జీడీపీ పెరుగుద వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత పడిపోతుందని మూడీ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా వేసింది. బ్యాంకింగ్‌ రంగం సమీప భవిష్యత్తులో కోుకునే పరిస్థితి కనపడడం లేదని యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం తర్వాత స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణు భావిస్తున్నారు. కరోనా వైరస్‌ మూంగా మార్కెట్‌ మరింత తీవ్రంగా దెబ్బతింటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలా అన్నదాని కన్నా రోజురోజుకూ పెరిగిపోతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలా అన్న అంశంపైనే ప్రధాని మోదీ ద ృష్టి కేంద్రీకృతమయింది. సంపద పెంచుకోవడం మాట దేవుడెరుగు, ఉన్న సంపద హరించుకుపోకుండా చూడడం ఎలాగో అర్థం కాని పరిస్థితి ఏర్పడిరది.