కాజల్‌ తో కన్నీరు పెట్టించిన క్యాబ్‌ డ్రైవర్‌..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండడానికి జనాు ఎన్నో జాగ్రత్తు తీసుకుంటున్నారు.

కానీ కరోనా బారిన పడకుండా ఉండాంటే రోజువారీ కూలిపని చేసుకునే వాళ్లు పను మానుకొని ఇంట్లో ఉండాల్సి వస్తుంది. దీనివ్ల కనీస ఆదాయం లేక ఇంటి ఖర్చుకు కూడా చాలా ఇబ్బందును ఎదుర్కొంటున్నారు. ఈ కరోనా ఏమోగానీ దేశంలోని బీదవారి ఆరోగ్యం తో పాటు వాళ్ల ఆకలి కడుపుపై కూడా దెబ్బ కొడుతుంది. ఇప్పటికే ప్రపంచ దేశా శాస్త్రవేత్తు వైద్యు కరోనాను అరికట్టడానికి పూనుకొని మందును కనిపెట్టడంలో తమునకలై పనిచేస్తున్నారు. ఆ మందును కనిపెడతారని జనాలో నమ్మకం ఉన్నప్పటికీ అది కనిపెట్టడం చాలా ఆస్యం అవుతుందేమోనని వాపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కరోనా బాధితు సంఖ్య కూడా అమాంతంగా పెరిగిపోతుంది. అయితే ఇటీవ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ను ఒక క్యాబ్‌ డ్రైవర్‌ తన పరిస్థితి తో కన్నీళ్లు పెట్టించాడట. సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని తెలిపింది కాజల్‌. ‘‘ఒక క్యాబ్‌ డ్రైవర్‌ తన ముందు ఏడుస్తుండటం చూసి కాజల్‌ అతనిని ఏమైందని అడిగిందట. ఆ క్యాబ్‌ డ్రైవర్‌ ఏడుస్తూ.. గడిచిన 48గంటలో మీరే నా మొదటి కస్టమర్‌ మేడం.. అని చెప్పి 70కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కాజల్‌ ని దింపేసి వెళ్ళాడట. అయితే ఈ సంఘటన పై స్పందిస్తూ కాజల్‌ ఇలా చెప్పుకొచ్చింది. దయచేసి క్యాబ్‌ డ్రైవర్లకు రోజువారీ కూలి పనిపై ఆధారపడి బతికేవాళ్లకు కాస్త డబ్బు ఎక్కువగానే ఇవ్వండి. ఎందుకంటే ఆ క్యాబ్‌ డ్రైవర్‌ పరిస్థితి విన్నాక నా గుండె తరుక్కుపోయింది. ఇలాంటి వాళ్ల గురించి ఆలోచిస్తే కళ్ళలో నీళ్లు తిరుతున్నాయంటూ వ్లెడిరచింది. కాజల్‌ పోస్ట్‌ పై సోషల్‌ మీడియాలో కూడా పాసిటివ్‌ రెస్పాన్స్‌ రావడం తో ఆనందం వ్యక్తం చేస్తుంది.