సైబర్ క్రైమ్ పోలీసుకు ఫిర్యాదు చేసిన నటి లావణ్య త్రిపాఠి
హైదరాబాద్ : హీరోయిన్ లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసును ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిపై ఆమె పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెయిల్ ద్వారా పోలీసుకు సమాచారం ఇచ్చారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సునిశిత్ పు యూట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లావణ్యపై పు ఆరోపణు చేసిన సంగతి తెలిసిందే.
లావణ్య ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ మాట్లాడుతూ.. యూట్యూబ్ చానెల్స్‌లో సునిశిత్ చేసిన వ్యాఖ్యను పరిశీలించామని తెలిపారు. ఆడవారిపై అసభ్యంగా మాట్లాడితే జైుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. సునిశిత్ ఇతర సెబ్రిటీపైన కూడా వ్యాఖ్యు చేశారని చెప్పారు. ఇప్పటివరకు లావణ్య మాత్రమే ఫిర్యాదు చేశారని వ్లెడిరచారు. లావణ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. సినిమా విషయానికి వస్తే.. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకొ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తమిళ్లో అథర్వ మురళి హీరోగా నూతన దర్శకుడు రవీంద్ర మాధవ తెరకెక్కిస్తున్న చిత్రంలో ఐఏఎస్ కావానుకునే అమ్మాయి పాత్రలో లావణ్య కనిపించనున్నారు.