మహారాష్ట్రలోని బీద్ నియోజకవర్గం ఎమ్మెల్యే నమిత ముందాద ఆదర్శం
ముంబయి : చాలా మంది ఎమ్మెల్యేు.. శాసనసభ సమావేశాకు డుమ్మా కొడుతుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం నిండు గర్భిణి అయినప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన నియోజకవర్గంలో నెకొన్న ప్రజా సమస్యను అసెంబ్లీలో వినిపించేందుకు ఆమె చిత్తశుద్ధితో సభకు హాజరయ్యారు. మహారాష్ట్రలోని బీద్ నియోజకవర్గం నుంచి నమిత ముందాద(30) అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం నమిత 8 నెల గర్భవతి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాు కొనసాగుతున్నాయి. గర్భిణి అయి కూడా ఆమె శాసనసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నమితను మీడియా పుకరించింది. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాు కొనసాగుతున్నాయి.. ఈ సభకు హాజరు కావడం తన విధి, బాధ్యత అని నమిత పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో అనేక సమస్యున్నాయి. వాటిని సభలో లేవనెత్తాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తనకు ఇబ్బంది ఉన్నప్పటికీ సభకు హాజరయ్యానని నమిత చెప్పారు. తనకు కూడా ఇతర గర్భిణి లాగే సమస్యు ఉన్నాయి. కానీ ప్రజు ముఖ్యం కాబట్టి.. డాక్టర్ల సహాు పాటిస్తూ అసెంబ్లీకి వచ్చానని నమిత తెలిపారు.