సాహసం ఆమె ఊపిరి

వేగమంటే ఆమెకు ఇష్టం. వేగమంటే ఆమెకు సరదా! వేగంలోనే ఆమెకు సంతోషం

విమానంలో రివ్వున ఎగిరిపోతుంది.. ఆమె ఓ పైట్‌. ట్రాక్‌పై రయ్యిన దూసుకెళ్తుంది.. ఆమె ఓ రేసర్‌. రెండూ కూడా పురుషు ఆధిపత్యమున్న, మహిళ ప్రాతినిధ్యం అత్యంత తక్కువగా ఉన్న రంగాలే. చాలా కఠినమైనవే. కానీ పెను సవాళ్లలోనే అనంతమైన ఆనందాన్ని వెతుక్కుంటోందీ ఈ అమ్మాయి. వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ తనదైన ముద్ర వేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్న తను స్నేహా శర్మ.
ఇంజిన్‌ శబ్దమంటే తనకు ఎంత ఇష్టమో. ‘‘అది నా హ ృదయ స్పందనతో జత కుస్తుంది. రేసింగ్‌ ట్రాక్‌పై దూసుకెళ్తుంటే వచ్చే మజా నాకింకెక్కడా రాదు’’ అని చెబుతుంది భారతదేశ ఫాస్టెస్ట్‌ మహిళా డ్రైవర్‌ స్నేహ. ఎంఎస్‌ఎఫ్‌ సిరీస్‌లో భాగంగా ఇటీవలే మలేషియాలో సెపాంగ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో జరిగిన లేడీస్‌ కప్‌లో పోటీపడ్డ ఏకైక భారతీయురాలామె. టీమ్‌ డీవీ మోటార్‌స్పోర్ట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె.. మొత్తం 70 మంది పోటీపడ్డ ఈవెంట్లో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. 15వ ఏట కెరీర్‌ను ఆరంభించిన స్నేహ అబ్బాయితో పోటీపడి ఎన్నో రేసుల్లో మెరిసింది.ఇప్పుడు భారత్‌లో మహిళా రేసర్‌ అంటే గుర్తొచ్చే పేరు స్నేహదే. ఓ వైపు పైట్‌గా విధు నిర్వరిస్తూనే తనకిష్టమైన రంగంలో రాణిస్తోంది ఆమె.
అలా మొదలైంది..
నిజానికి రేసింగ్‌తో స్నేహ ప్రయాణం సరదాగానే ఆరంభమైంది. కారు చేజింగ్‌ు, ఆశ్చర్యపరిచే కారు డ్రైవింగ్‌ సన్నివేశాు ఉండే హాలీవుడ్‌ సినిమాలే ఆమెకు ప్రేరణ. చిన్నప్పుడు ఆ సినిమాు చూస్తుంటే తెలియని ఉత్తేజం వచ్చేది. దీంతో అలాంటి కార్లు నడపాని, రేసింగులో అడుగుపెట్టాని చిన్నప్పుడే నిర్ణయించుకుంది. 2014లో 14 ఏళ్ల వయసులో స్థానికంగా గోకార్టింగ్‌ రేసు (చిన్న కార్లతో) జరుగుతున్నాయని తెలిశాక తరచుగా చూడ్డానికి వెళ్లేది. ప్రపంచవ్యాప్తంగా ఫార్ములావన్‌ రేసర్ల ప్రయాణం గోకార్టింగ్‌తోనే మొదవుతుంది. అక్కడ మార్షల్స్‌ను అడిగి రేసింగ్‌ టెక్నిక్‌ు తొసుకునేది. అందుకోసం వాళ్లకు దాచుకున్న పాకెట్‌ మనీని చెల్లించేది. ట్రాక్‌పై వివిధ చోట్ల ఉండి డ్రైవర్లు ప్రమాదా బారిన పడకుండా, వారి ప్రయాణం సాఫీగా సాగేలా జెండాు పట్టుకుని సహకరించడం మార్షల్స్‌విధి. కానీ రేసింగ్‌పై వారికి ఉన్న కొద్ది పరిజ్ఞానాన్ని తొలి అడుగేయడానికి ఉపయోగించుకుంది స్నేహ. క్రమంగా తనూ ట్రాక్‌పై దిగింది. ముంబయిలోని ఆ గోకార్టింగ్‌ ట్రాక్‌పై జరిగే అన్ని రేసుల్లోనూ పాల్గొనడం మొదలెట్టింది. ఓసారి చాలా మంది ప్రొఫెషనల్‌గా శిక్షణ పొందిన డ్రైవర్లతో పోటీపడ్డ ఆమె రేసులో రెండో స్థానం సాధించి అందరి ద ృష్టిలో పడిరది. ఆ తర్వాత జేకే టైర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, రాయోరేసింగ్‌ లాంటి అనేక ఛాంపియన్‌షిప్స్‌లో అబ్బాయితో పోటీపడిరది. ఐతే చదువు మీద ద ృష్టిపెట్టేందుకు, పైలైట్‌ లైసెన్స్‌ సంపాదించేందుకు కొంతకాం ఆమె ట్రాక్‌కు దూరమైంది. తిరిగొచ్చాక చిన్నచిన్న కేటగిరీల్లో పాల్గొనడం మొదలెట్టింది. 2009లో జేకే టైర్స్‌ నేషనల్‌ ఫోర్‌ స్ట్రోక్‌ ఛాంపియన్‌షిప్‌ అబ్బాయితో పోటీపడ్డ ఆమె పదిసార్లు టాప్‌-3లో నిలిచి అందరి ద ృష్టినీ ఆకర్షించింది. జాతీయ కార్టింగ్‌ ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించిన ఏకైక అమ్మాయిగా కూడా ఆమె ఘనత సొంతం చేసుకుంది. మెర్సీడస్‌ యంగ్‌ స్టార్‌ డ్రైవర్‌ ప్రోగ్రామ్‌లో 260 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న ఆమె ఐదో స్థానం సాధించింది. ‘భారత ఫాస్టెస్ట్‌ మహిళ’గా గుర్తింపు తెచ్చుకుంది. అ తర్వాత దేశంలో ఎన్నో రేసుల్లో విజయాు అందుకుంది. మహిళలే పాల్గొనే డబ్ల్యూ-సిరీస్‌కు కుదించిన జాబితాలో చోటు సంపాదించినఇద్దరు భారతీయుల్లో స్నేహ ఉంది.
అది గోకార్టింగ్‌ కావొచ్చు, ఫార్ములా వన్‌ కావొచ్చు.. రేసుల్లో స్నేహకు బాగా నచ్చిన విషయం.. అమ్మాయిు, అబ్బాయిు ఒకే వేదికపై సమానుగా పోటీపడడం. ‘‘ఒక్కసారి ట్రాక్‌పై వెళ్లాక నేను మహిళను కాదు, పురుషుణ్ని కాదు. నేను రేసింగ్‌ డ్రైవర్‌ను అంతే. ఇలాంటి వైఖరి వల్లే నేను మెరుగైన ప్రదర్శన చేయగుగుతున్నా. పురుషుతో పోటీపడగుగుతున్నా’’ అని అంటోంది స్నేహ.అటూ ఇటూ..
పైట్‌గా కెరీర్‌ను కొనసాగిస్తూనే రేసింగ్‌లో ఈ విజయాన్నీ సాధించడం స్నేహలో పట్టుదకు, సామర్థ్యానికి నిదర్శనం. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ఆమెకు ఇటీవలే కెప్టెన్‌గా పదోన్నతి కూడాభించింది. ఇండిగో ఇప్పుడు ఆమెకు స్పాన్సర్‌ చేస్తుంది కూడా. పైట్‌గా, రేసర్‌గా కొనసాగడం కష్టంగా లేదా అని అడిగితే.. తాను కోల్పోతున్నదానికంటే పొందుతున్న ఆనందమే ఎక్కువ, ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నది స్నేహ సమాధానం. స్నేహకు ఎఫ్‌ఐఏ నుంచి ‘అసాధారణ మహిళా డ్రైవర్‌’ అవార్డు కూడా దక్కింది.
అమ్మా.. నాన్నా.. వద్దన్నా..
తనకు నచ్చిన రేసింగ్‌లో స్నేహ అంత తేలిగ్గా ఈ స్థితికి రాలేదు. రేసింగ్‌ ప్రమాదకరమైంది కావడంతో ఆరంభ రోజుల్లో తమ కుమార్తె రేసుకు వెళ్లడాన్ని తల్లిదండ్రు తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్లతోఆమెతో ఎన్నో సార్లు పోరాడిరది కూడా. వాళ్లకు తెలియకుండా రేసుకు వెళ్లేది. వారి ద ృష్టిలో పడకుండా ఉండేందుకు స్నేహితు ఇళ్లలో హెల్మెట్‌ పెట్టేది. ఐతే రేసింగ్‌పై స్నేహ ఇష్టాన్ని చూసిన వాళ్లు..ఆమె చదువు, ఇతర విషయాల్లోనూ క్రమశిక్షణతో ఉండడంతో చివరికి రేసుకు ఒప్పకున్నారు. మొదట్లో ఒంటరిగా రేసుకు వెళ్లిన ఆమె.. ట్రాక్‌ దగ్గరకు పుస్తకాను కూడా తీసుకెళ్లేది. బస్సుల్లో,సమయం దొరికినప్పుడు రేస్‌ ట్రాక్‌ పక్కన చదువుకునేది.