రాజధాని క్రీ(నీ)డ

గత కొద్ది రోజుగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయచర్చు, వాదవివాదాు పూర్తిగా అమరావతిలో చిక్కుకుపోయాయి.

వరద ముందు డ్రోన్‌ ప్రహసనాతో చంద్రబాబు నివాసం చుట్టూ మొదలైన కథ అసురాజధాని అభివృద్ధిని నమ్ముకున్న వేవే కుటుంబా భవితనే గందరగోళంలోకి నెట్టింది. సంబంధిత సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ముంపు ముప్పు నిర్మాణ వ్యయం వంటి మాట చాటున అసుకే ఎసరు పెట్టిన భావన కలిగించారు. ఫిరాయింపుతో బపడ్డామనుకుంటూ ఆంధ్రలో అదను కోసం చూస్తున్న బిజెపి నేతు దీనికి మరింత ఆజ్యం పోశారు. అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి స్థానికంగానూ రాష్ట్రంలోనూ ఘోర తిరస్కృతికి గురైన తొగుదేశం రంగంలోకి దిగి రాజకీయ క్రీడ తీవ్రం చేసింది. అప్పుడూ ఇప్పుడూ రైతు, స్థానిక పేదు, శ్రమజీవు, దళితు, బహీనుకోసం పోరాడుతున్న సి.పి.ఎం వామపక్షాు ఇప్పుడూ ఈ అయోమయాన్ని పోగొట్టడం పైనే ద ృష్టి పెట్టాయి. రాష్ట్ర నాయకు పర్యటను జరిపి వచ్చారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అమరావతిలో పర్యటించారు.
రాజధానిని 2014 సెప్టెంబరులో శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడంతో వే కోట్ల రూపాయ మివైన పను నడుస్తున్నాయి. అన్నింటినీ మించి రైతు నుంచి భారీగా 37 వే ఎకరాు సమీకరించారు. కాబట్టి అమరావతి నుంచి రాజధాని మార్చడం తేలిక కాదని ఆచరణ సాధ్యం కాదని అందరికీ తొసు. అయినా సరే ఉద్దేశ పూర్వకంగా మంత్రులే సందేహాస్పదంగా మాట్లాడటం యాద ృఛికేంకాదన్నది కూడా నిజం. ప్రజ స్పందన ఎలా వుంటుందో చూడటానికైనా కావొచ్చు. లేదా వీలైన మేరకు ఖర్చు తగ్గించుకోవడానికైనా అయ్యుండొచ్చు. అదీకాక పోతే టిడిపి హయాంలోని ప్రణాళికను భగంచేసి తమకు అనుకూమైన మంగళగిరి వైపు నిర్మాణాు మరలించేందుకైనా కావొచ్చు. పోనీ దొనకొండ, నూజివీడు వంటి చోట్ల కొనుగోు చేసిన తమ వారికి ఎంతో కొంత మేు జరిగే వాతావరణం సృష్టించడానికైనా ఉద్దేశ పూర్వకంగానే ఈ రచ్చ రగిలించబడిరది. (కక్ష అనీ అంటున్నారు.) అందువ్లనే ఎవరు ఎంత విమర్శించినా బాధ పడినా పూర్తి స్పష్టంగా ఇక్కడే వుంటుంది, భయపడకండని భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడటం లేదు. ఎక్కడో తిరుపతిలో బస్‌ టికెట్లపై జెరూసలేం యాత్ర గురించి ప్రచురించారని బిజెపి చిచ్చు పెడితే ముఖ్యమంత్రి కార్యాయం (సి.ఎం.వో) తక్షణం వివరణఇచ్చింది. కాని అమరావతి గురించి మాత్రం ముఖ్యమంత్రి నోరు మెదపకుండా మౌనమే నా భాష అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చాక చెబుతారనీ, సి.ఆర్‌.డి.ఎ సమీక్ష అయ్యాక ప్రకటిస్తారని రకరకా మాటు చెప్పారు గాని అవేమీ జరగలేదు. పైగా ‘మేం మారుస్తామని చెప్పనప్పుడు ఎందుకు ఖండిరచా’ని ఎదురు వాదన చేస్తున్నారు. శివరామక ృష?న్‌ కమిటీ పేరిట డొంకతిరుగుడు ప్రశ్ను వేస్తున్నారు. తొగుదేశం నేత ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ ఉదాహరణను ఏకరువు పెడుతున్నారు. వాటిపై తప్పక చర్య తీసుకోవచ్చు గాని ఆ పేరిట 60 వే మందికి పైగా వున్న రైతుతోనూ, మరెన్నో వే మంది వ్యవసాయ కార్మికు, శ్రామికు జీవితాను అయోమయంలోకి నెట్టడమెందుకంటే అటూ ఇటూ తిప్పి మాట్లాడుతున్నారు. ఇది బాధ్యతా రహితమే గాక ఉద్దేశపూర్వకం.ముఖ్యమంత్రికి తెలిసీ సాగుతున్న కపట నాటకం. ఎన్నిక సమయం లోనే రాజధానిని మారుస్తారని టిడిపి ప్రచారం చేసింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి జీవిఎల్‌ నరసింహారావు, ఎం.పి టి.జి వెంకటేశ్‌ వంటి వారు ఇప్పుడు మార్పు తథ్యమని చాటిస్తున్నారు. రామాయణంలో పిడక వేటలాగా వైసిపి ఎం.పి విజయసాయి రెడ్డి తాము మోడీ, అమిత్‌ షా ఆశీస్సుతోనే ఇదంతా చేస్తున్నామంటే, మాపెద్దకు చెప్పారని బిజెపి నేతు ధ ృవీకరిస్తున్నారు. వైసిపి, టిడిపి, బిజెపి పోటాపోటీ రాజకీయంలో రాష్ట్రం నలిగిపోతున్నది. ఈ క్రమంలో రైతుకు రావసిన కౌు కూడా ఆస్యమైంది. అసైన్డు భూము వారికి పరిహారం పెంచుతామన్న హామీ గాలికి పోయింది. ఆఖరుకు పింఛన్ల వ్యవహారం కూడా అరకొరగానే మారింది. ఇప్పుడు సమీక్ష తర్వాత కూడా మున్సిపల్‌ శాఖా మంత్రి బొత్స ‘డబ్బుంటేకడతామని, ఎంత వరకు అవసరమో చూస్తామ’ని చెప్పడం సానుకూ స్వరంలో గాక సందేహాస్పదంగానే వుండటం గమనార్హం. మరోవైపున మంగళగిరి ప్రాంతాలో నూతన కార్యాయ భవనా కోసం అన్వేషణ సాగుతున్నట్టు ఆదేశాు అందినట్టు కనిపిస్తున్నది. గత ప్రభుత్వం 800 కిలో మీటర్ల మేర రాజధాని ప్రాంతంగా ప్రకటించింది గనక ఎక్కడ కట్టినా సమర్థించుకోవచ్చు. అయితే దొనకొండ వంటి చోట్ల స్పెక్యులేషన్‌తో భూము ధరు పెరిగిపోతుంటే స్పష్టత ఇవ్వాలి. అక్కడ అమ్మేవాళ్లు, కొనేవాళ్లు కూడా రేపు మరోసారి నష్టపోకుండా చూడవసిన బాధ్యత వుండాలి కదా? గతంలో తమ వారంతా భూము తీసుకున్న నూజివీడు, దొనకొండ వంటి పేర్లు పైకి రావాంటే అమరావతి గందరగోళంలో పడాల్సిందేనని సర్కారు భావిస్తున్నది. ఆ దిశలో కొంత ప్రభావం చూపింది కూడా.
నవ రత్నాు, సామాజిక తరగతు వారిగా ఓటర్లను ఆకట్టుకోవడం, అస్మదీయుకు కాస్త లాభం చూపించడం జగన్‌ ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా వుంది. చంద్రబాబు వూరించిన ప్రపంచ రాజధాని కథుతప్పే కావచ్చు. కాని ఆధునిక యుగంలో దానికి ఒక స్థాయి అయితే వుండాల్సిందే కదా.. కట్టేటప్పుడే వాస్తవికంగా దీర్ఘకాలిక దృష్టితో అడుగులేస్తామా లేక అరకొరగా సరిపెట్టుకుంటామా? ఉన్న భవనాుచాన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడటంతో ఈ సందేహాు తప్పక తలెత్తుతాయి. అప్పుడూ ఇప్పుడూ కూడా రాజధానికి సహకరించాల్సిన బాధ్యత వున్నా మోడీ ప్రభుత్వం నామకార్థంగా సరిపెట్టింది. కేంద్రంపైజగన్‌ ఒత్తిడి తెచ్చి సాధించుకునే బదు గత ప్రభుత్వ నిర్వాకాను నిగ్గు తేల్చిన తర్వాత తీసుకుంటామని చెప్పి రావడం ఏం రాజనీతి? ఏ పానా ధర్మం? బిజెపి పెద్దు తమ బాధ్యత నిర్వహించకుండా ఇక్కడకొచ్చి విమర్శు కురిపిస్తుంటే విజయసాయి రెడ్డి వంటి వారు వారి ఆశీస్సుకు ఆనందించడం ఎలా అర్థం చేసుకోవడం గతంలోనే పను కోల్పోయిన స్థానిక శ్రామికు ఇప్పుడు పూర్తిగా ప్రతిష్టంభనలో జీవితాు ఎలా సాగిస్తారు? భూము ఇచ్చిన, ఇవ్వగలిగిన వారిని పక్కన పెడితే దళితు, పరాధీను సంగతేంటి? ఇంత భూసమీకరణ ఇంతటి జీవన విఛిన్నేం వృథా అయిపోయి మళ్లీ మొదటి నుంచి బయుదేరతారా? పురిటి నీళ్లతో పాటు పుట్టిన బిడ్డను కూడా పారేసే ఈ వైఖరి కొత్త ప్రభుత్వానికి ఆది లోనే హంసపాదులా అప్రతిష్ట తెచ్చిన మాట కాదనలేనిది. చుట్టూ వున్న వంధిమాగధు, కేవం టిడిపి వ్యతిరేక కోణం లోనే మాట్లాడే వారు వంత పాడొచ్చు గాని ప్రజు మెచ్చడం లేదు. రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా ఇదో దుమారంగా వుంది. వికేంద్రీకరణ, వెనకబడిన ప్రాంతా అభివృద్ధి ఎవరూ కాదనరు.
 చంద్రబాబు కేంద్రీకృత విధానాన్ని మార్చవచ్చు గాని రాజధాని నిర్మాణంతో స్థానికు బతుకుతో, భావాతో ఆడుకోరాదు కదా! గత ప్రభుత్వం చారిత్రకమైన రాజధాని వంటి విషయంలో కూడా ముందస్తుగా ఎవరితో చర్చించకుండానే, అఖిపక్ష సమావేశం వంటివి జరపకుండానే ఎకాఎకిన వ్యూహాత్మకంగా అసెంబ్లీలో బ్లిు పెట్టి మమ అనిపించుకుంది. మరి దాన్ని మార్పుూ చేర్పుూ చేయదుచుకుంటే జగన్‌ ప్రభుత్వమైనా సంప్రదించాలి కదా! పారదర్శకంగా సమగ్రంగా వ్యవహరిస్తున్నదా అంటే అదీ లేదు. టిడిపి కూడా తన ఘోర పరాజయాన్ని మర్చిపోయి తన హయాంలో అంతా అదుÄతేంగా నడిచినట్లు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం దానినంతా పాడు చేస్తున్నట్టు గగ్గోు పెడుతున్నది. మొత్తం మీద రాజధాని నిర్మాణానికి ప్రధాన బాధ్యత వహించాల్సిన బిజెపిని ఇటు వైసిపి, అటు టిడిపి దోషిగా నిలిపే బదు ఈ వివాదంలో బిజెపికే లాభం కలిగేలా వ్యవహరించడం వాటి హ్రస్వద ృష్టినే సూచిస్తోంది. అమరావతి పర్యటనలో జనసేన అధినేత మోడీని శ్లాఘించడమూ అదే కోవకు చెందుతుంది.
అమరావతి మాత్రమే గాక ఎ.పికి సంబంధించిన పోవరం తదితర ప్రాజెక్టు విషయంలోనూ రివర్స్‌ నిర్ణయాు ఒడుదుడుకు మయంగానే వున్నాయి. పవన సౌర విద్యుత్‌ అధిక మొత్తంలో అధిక రేట్లకు పాతికేళ్ల పాటు కొనితీరాని శాసించే పి.పి.ఎపై పునఃసమీక్ష సంప్రదింపు తప్పు కాదు. కాని అదో తంతుగా మార్చి ప్రతిదాన్నీ తిరగదోడడం మొదు పెడితే అంతూ పంతూ వుండదు. కాంట్రాక్టర్లు,వ్యాపార వేత్త స్వభావాు మారేవి కావు. ఎవరైనా కాస్త ఇంచుమించు అదే అయినప్పుడు ప్రజకు స్పష్టత ఇవ్వకుండా ప్రతిపక్షాతో కనీసం సంప్రదించకుండా సంబంధిత సంఘా అభిప్రాయానైనా తీసుకోకుండా ఆపేస్తే పోవరం నిర్మాణం ఆస్యానికే గాక అధిక వ్యయానికి కూడా దారితీయొచ్చు. తస్మదీయును తప్పించి అస్మదీయును తెచ్చుకోవడానికే అయితే ఈ ప్రహసనం సరైంది కాదు.నిర్దిష్టంగా నిర?యాు తీసుకోవచ్చు గాని గుండుగుత్తగా నిలిపేయడం, జరిగిపోయిన కాలాన్ని కూడా రెట్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌తో గుప్పిట్లోకి తెచ్చుకోవానుకోవడం వాస్తవికత కాదు. వాగ్ధానా అములో పథకా ఆచరణలో పాక్షికత్వాు పరిమితు కొత్త షరతుూ ఎలాగూ వున్నాయి. కాని నిరుద్యోగు నియామకాు లేకపోవడం చిరుద్యోగును అరుద్యొగును (కాంట్రాక్టు) అమాంతం తొగించాని ఆరడిపెట్టడం ఆత్మహత్య వరకూ వెళ్లింది. ఆందోళను అనివార్యం చేస్తున్నది. ఈ ఒక్క విషయంలో మాత్రం రివర్స్‌ లేకుండా గత ప్రభుత్వంలో లాగే పోలీసును ప్రయోగించి ఆంక్షు విధించి అడ్డుకోవడంచూస్తున్నాం. అదే తరగతు అండదండతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ ఉద్యోగ కార్మికు ఘోష పెడచెవిని పెట్టడం అనుచితం. నిర్మాణాు నిర్ణయాలో రివర్స్‌ు తగ్గించి నిర్బంధానువెనక్కు తీసుకోకపోతే అతి త్వరగా ప్రజ అసంతృప్తికి గురి కావసిన పరిస్థితి అనివార్యమవుతుంది. బిజెపిని నమ్ముకుని రాష్ట్ర భవిష్యత్తుతో చెగాటమాడితే మొదటికే మోసం వస్తుంది.