ఆర్థిక అంకెల గారడీ బడ్జెట్‌

దేశ గ్రామీణ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్న వేళ…జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్‌), జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సి)ను రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక మానవీయ సంక్షోభానికి దారితీస్తుంది. బడ్జెట్‌ ముంగిట, బిజెపి నేతత్వం లోని ప్రభుత్వం గ్రామీణ పేదల ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగపడిందో చూద్దాం.
వినియోగదారుల వ్యయ సర్వే (సిఇఎస్‌) ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ఆ పని చేస్త్తుంది. కుటుంబాల ఖర్చుకు సంబంధించిన వివరాలను సిఇఎస్‌ తెలియచేస్తుంది. ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్‌ కేటాయింపులను మెరుగు పరచడంలో సిఇఎస్‌ ద్వారా సేకరించిన సమాచారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, 2017-2018 కి సంబంధించిన తాజా సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టింది. కాని ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ పత్రిక ఆ సమాచారాన్ని లీక్‌ చేస్తూ ప్రచురించిన వివరాల ప్రకారం, వినియోగదారుల వ్యయం గత 40 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. 2011-2012, 2017-2018 సంవత్సరాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని (ఎంపిసిఇ) పోల్చుతూ ప్రొపపఎస్‌.సుబ్రమణియన్‌ చేసిన విశ్లేషణ ‘ది ఇండియా ఫోరం’ పత్రికలో వచ్చింది. గ్రామీణ భారతం ఎంత దయనీయంగా వుందో తెలియచేస్తుందీ వ్యాసం. గ్రామీణ జనాభాను ధనికుల నుంచి నిరుపేదల వరకు ర్యాంకులు ఇచ్చి 10 గ్రూపులుగా విభజించి వారిని పరిశీలిస్తే ప్రతి సమూహానికి నెలవారీ కొనుగోలు శక్తి పడిపోయినట్టు తేలింది. అంటే మొత్తం గ్రామీణ సమాజంలో వినియోగం, ఆదాయం తగ్గాయని అర్థం. ఉదాహరణకు, గ్రామీణ జనాభాలో 50 శాతం పేదవారి సగటు నెలవారీ వినియోగ స్థాయి 2011-2012లో రూ.1,138. ఇది 2017-2018లో రూ.1,082 కి పడిపోయింది. మొత్తం మీద, సగటు నెలవారీ గ హ వినియోగం 2011-12లో రూ. 1,430 నుండి 2017-18 నాటికి రూ.1,304 కు తగ్గింది. సుమారు 9 శాతం క్షీణించింది. మరో మాటలో చెప్పాలంటే, ఎక్కువ మంది పేదలుగా మారారు. దాంతో ఖర్చు చేయడానికి వారి దగ్గర కొద్ది డబ్బు మాత్రమే ఉంది.
తమకు అసౌకర్యం కలిగిస్తాయి గనకనే ఇటువంటి పచ్చి నిజాలతో కూడిన సర్వే వివరాలను కుంటి సాకులతో తొక్కిపట్టేందుకు కేంద్రం ప్రయత్నించింది. ప్రభుత్వానికి ఇది కొత్తేం కాదు. 2017-2018 కార్మిక స్థితిగతుల సర్వే వివరాల విడుదల కూడా ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వచ్చింది. అయితే 2019 జనవరిలో ఈ వివరాలు లీక్‌ అయ్యాయి. బిజెపి ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం…గత 45 సంవత్సరాలలోకెల్లా గరిష్ట స్థాయికి చేరుకుందని తేలింది. అయితే లీకైన వివరాలు ‘ముసాయిదా నివేదిక’ లోవని ప్రభుత్వం తప్పించుకుంది. సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కూడా నిరుద్యోగ డేటాను విడుదల చేయలేదు. అంతమాత్రాన వాస్తవ గణాంకాలు మారిపోవు. ప్రభుత్వాలు పారదర్శకంగా వుండడం కోసం సంవత్సరాల తరబడి చేస్తున్న పోరాటాలు అణగదొక్కబడుతూనే వున్నాయి. సమాచారాన్ని తొక్కిపట్టడం వల్ల సంస్థాగత విలువలు, రాజకీయ ఆర్థిక వ్యవస్థ క్రమేణా క్షీణించి పోతాయి.
ఆహార ద్రవ్యోల్బణం అంతకంతకు పెరిగిపోతోందని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) వెల్లడించింది. 2019 ఆగస్టులో 2.99 శాతం వున్న ఆహార ద్రవ్యోల్బణం 2019 డిసెంబర్‌ నాటికి 14 శాతానికి పెరిగిందని ఎన్‌ఎస్‌ఓ తాజా నివేదికలు తెలియచేస్తున్నాయి. కూరగాయల ధరల (60 శాతం కంటే ఎక్కువ) పెరుగుదల చాలా తీవ్రంగా వుంది. పప్పు ధాన్యాల ధర 15 శాతం కన్నా ఎక్కువ పెరిగింది. ధరల పెరుగుదల కొంతమంది రైతులకు ప్రయోజనం చేకూర్చవచ్చు. కూరగాయల ధరల పెరుగుదల కాలానుగుణంగా ఉండవచ్చు. అయితే ఈ పెరుగుదల భూమి లేని, చిన్న రైతులను ఎలా ప్రభావితం చేస్తుందన్నది ప్రశ్న. గ్రామీణ జనాభాలో 5 శాతం సంపన్నులు సైతం త ణ ధాన్యాలు, పప్పు ధాన్యాల మీద చేసే ఖర్చు ఒక్కొక్కరికి రోజుకు రూ.2.50 కంటే తక్కువగానే వుందని ఎన్‌ఎస్‌ఒ నివేదిక తెలియచేస్తోంది. పేద వర్గాలకు చెందిన వ్యక్తి త ణ ధాన్యాలు, పప్పు ధాన్యాల మీద రోజుకు సుమారుగా ఒక్క రూపాయి మాత్రమే ఖర్చు చేస్తున్నాడు. 2011 సామాజిక-ఆర్థిక, కుల జనాభా లెక్కల ప్రకారం, 56 శాతం కుటుంబాలకు భూమి లేదు. 51 శాతం కుటుంబాలు ఆదాయం కోసం కూలీ, నాలీ చేసుకుంటున్నాయి. వీరికి ‘ఉపాధి హామీ పథకం’ ప్రాణవాయువుగా ఉపయోగపడుతుంది. అయితే గత ఐదేళ్లుగా ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపు చాలా తక్కువగా ఉంది. అక్టోబర్‌ నుండి కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు నిధులు విడుదల చేయలేదు.
వేతన చెల్లింపుల్లో నిరంతర జాప్యం, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం, వేతనాలు తక్కువగా వుండడంతో కార్మికులు ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు తటపటాయిస్తున్నారు. ఆదాయాలు తక్కువగా వుండడం, ఆహార ధరలు అధికంగా వుండడంతో భూమి లేని పేదల ఆహార వినియోగం అంతకంతకూ తగ్గిపోతోంది. దీంతో వారు తీసుకునే పోషకాహారం తగ్గిపోయి, వారి శారీరక, మానసిక ఎదుగుదల క్షీణిస్తోంది. పని డిమాండ్‌, పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు, ఆహార ద్రవ్యోల్బణం చూసినప్పుడు ఈ పథకానికి రూ.1 లక్ష కోట్ల కన్నా తక్కువ కేటాయిస్తే ఏమాత్రం సరిపోదు.
గ్రామీణ వేతనాలు పెంచడం, ఉపాధి హామీ పథక పని తీరు, చెల్లింపులను మెరుగుపరచడంపై దష్టి పెట్టడానికి బదులుగా, బిజెపి నేత త్వం లోని ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్‌) వంటి విభజన విధానాలపై వనరులను వ ధా చేస్తోంది. ఎన్‌పిఆర్‌ అంచనా వ్యయం రూ.4,000 కోట్లు. ఉపాధి హామీ పథకం ద్వారా 2.2 కోట్ల మంది భూమి లేని కార్మికులకు ప్రస్తుత వేతన ధరల ప్రకారం 100 రోజుల పనిని కల్పించగలదు. ఏకపక్షంగా ఆర్టికల్‌ 370ను బలహీనపరచడం వల్ల కాశ్మీర్‌ లోయకు సుమారు రూ.18,000 కోట్ల నష్టాలు సంభవించాయని కాశ్మీర్‌ వాణిజ్య మండలి నివేదికలు తెలియచేస్తున్నాయి. ఆగస్టు 5 నుండి సుమారు 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జమ్మూ, లడఖ్‌ లెక్కలను దానికి జత చేయాల్సి వుంటుంది. అనేక రాష్ట్రాలకు చెందిన, మరీ ముఖ్యంగా బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 4 లక్షలకు పైగా వలస కూలీలు ఆగస్టు 5న కాశ్మీర్‌ లోయ విడిచి వెళ్లిపోయారు. వారు రాత్రికి రాత్రి నిరుద్యోగులుగా మారిపోయారు. ‘స్టేట్‌ లెస్‌’ గా వర్గీకరించిన వారి కోసం నడుపుతున్న నిర్బంధ కేంద్రాల ఖర్చులను కూడా గమనంలో వుంచుకోవాలి. మహిళలు, ముఖ్యంగా వారు వివాహం తర్వాత మకాం మార్చడంతో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఎందుకంటే వారి దగ్గర సంబంధిత పత్రాలేవీ వుండవు.
నిజానికి కేంద్ర ప్రభుత్వం ‘పి.ఎం మాత  వందన యోజన’ పథకం కింద గ్రామీణ మహిళలకు నగదు బదిలీని సరిగ్గా చేయలేకపోతోంది. కారణం లబ్ధిదారులకు సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవడమే. అటువంటిది ఎన్‌పిఆర్‌-ఎన్‌ఆర్‌సి అమలు ఒక భయానక విపత్తుకు దారితీస్తుంది! కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు రూ.2.83లక్షల కోట్లు కేటాయించడం వల్ల జిల్లాకు వ్యవసాయరంగానికి ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా వర్షాభావ జిల్లాలకు అదనపు నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించడంపట్ల రై తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భూసార రక్షణకు అదనపు సాయంతోపాటు సంస్కరణలు చేస్తామని ప్రకటించడం హర్షణీయం అంటున్నారు. నాబార్డు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం గోదాముల నిర్మాణం చేపట్టడం వల్ల జిల్లాకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. మహిళ స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందు కోసం కొత్తగా ధాన్యలక్ష్మీ పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించడం పై హర్షం వ్యక్తమవుతోంది. ధాన్యం కొనుగోలు కోసం మహిళా సంఘాలకు నాబార్డు ద్వారా సా యం అందించనున్నట్లు కేంద్రం ప్రకటించిం ది. ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడం వల్ల జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్చభారత్‌ కార్యక్రమంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంతో పల్లెల్లో పారిశుధ్య కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి. జిల్లాను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ)గా ప్రకటించగా, ప్రస్తుతం కేంద్రం ప్రారంభించే స్వచ్ఛభారత్‌ కొత్తపథకాలతో పల్లెలకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అదే విధంగా ఓడీఎఫ్‌ ప్లస్‌ ద్వారా పారిశుధ్యానికి అధికప్రాధాన్యత ఇస్తామని ప్రకటించడం వల్ల గ్రామాలు స్వచ్ఛగ్రామాలుగా మారే అవకాశం ఉంది. పాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులకు కషిచేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించడంపై జిల్లాలో పాడిరైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పశువుల్లో కత్రిమ గర్భధారణకు అదనపు సౌకర్యాలు కల్పించడంతోపాటు పాడిపరిశ్రమ ఆధారిత ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు అవుతుందని ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్యరంగానికి రూ.69వేల కోట్లు కేటాయించడంతోపాటు ప్రతి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధం గా వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటుచేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కూడా పీపీపీ విధానంలో వైద్యకళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా వైద్య పీజీ కోర్సులకోసం పెద్దాసుపత్రులకు ప్రోత్సాహం అందిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర బడ్జెట్‌లో పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహానికి రూ.27,300కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతోపాటు దేశ వ్యాప్తంగా డేటాసెంటర్‌పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మెగా లెదర్‌పార్కుతోపాటు ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌, టెక్స్‌టైల్‌పార్కులో ఏదో ఒకటి ఏర్పాటు అయ్యేఅవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతి జిల్లాలో నాన్‌గెజిటెడ్‌ అధికారుల నియామక పరీక్షా కేంద్రాలు ఏర్పా టు చేయడంతోపాటు జాతీయస్థాయిలో ఆన్‌లైన్‌ ద్వారా కామన్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ ద్వారా నాన్‌గెజిటెడ్‌ అధికారుల నియామకం జరుపుతామని ప్రకటించడంతో జిల్లాలో నాన్‌గెజిటెడ్‌ అధికారుల నియామక పరీక్షా కేంద్రం ఏర్పాటు అవుతుందని భావిస్తున్నారు. జిల్లాలో ఉపాధికరువై నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఉపాధిపొందుతుండగా బడ్జెట్‌లో నిరుద్యోగ యువతకు ఎలాంటి పోత్సాహకాలు ప్రకటించకపోవడంపై నిరాశ వ్యక్తమవుతోంది. కోస్తా ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధిఅవకాశాలు కల్పించేందుకు వీలుగా మత్స్యపరిశ్రమలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 3,400 సాగర్‌మిత్రలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ తెలంగాణ జిల్లాలో యువతకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చే లా యువతకు ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపే బడ్జెట్‌గా మారింది. వ్యవసాయం, అన్నిరకాల ఉత్పత్తులపై పన్నుల భారం పెంచడం సమంజసం కాదు. ఆర్థిక వ్యవస్థ, బలహీనతలను కప్పిపుచ్చుకునేందుకు అంకెలగారడీ బడ్జెట్‌ను రూపొందించింది. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్‌..ఎం.హరిశ్చంద్రగుప్త (మునిసిపల్‌ కౌన్సిలర్‌)
ప్రభుత్వం అన్నివర్గాలకు ఆమోదనీయమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. పేదల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించడం, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు సమర్ధనీయం. కేంద్ర బడ్జెట్‌ దేశ ప్రగతికి నాందిపలుకుతుంది. మెడికల్‌కాలేజీల ఏర్పాటుకు ఆమోదం హర్షణీయం. పేదలకు ఒరిగేది శూన్యం..ఎం.కనకారెడ్డి (సీపీఎం జిల్లా కార్యదర్శి)
కేంద్ర బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేలా అంకెలగారడితో రూపొందించారు. ఆచరణలో పేదలకు ఒరిగేది శూన్యం. పన్నుల భారంపై చూపిన శ్రద్ధ పేదల సంక్షేమంపై చూపించలేదు. తెలంగాణకు అన్యా యం జరిగింది. కేటాయింపులు ఆశాజనకంగా లేవు.