ఏడాదిలో సగటున 75 రోజులు స్మార్ట్ ఫోన్‌కు బానిసలు
- – సైబర్ మీడియా రీసెర్చ్ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు
- – ఏడాదిలో 1800 గంటలు స్మార్ట్ ఫోన్ లోనే లీనం
- -స్మార్ట్ ఫోన్ ప్రభావంతో కుటుంబ సభ్యులతో మాటలు దూరం
- -రోజులో 5 నిమిషాలు కూడా ఆత్మీయులతో మాట్లాడకపోవడం
- -హైస్కూలు స్థాయిలోనే వాడుతున్న 41 శాతం విద్యార్థులు
- -తీవ్రమైన డిప్రషన్‌కు గురవుతున్న యువత
- -రోజురోజుకూ పెరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తులు
- -యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఇంటర్నెట్ అలవాటు
- -శారీరక క్రీడలకు దూరం అవుతున్న చిన్నారులు
- -ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరికీ రెండేసి స్మార్ట్ ఫోన్లు
హైదరాబాద్:
ముచ్చట పడేలా ఉండే స్మార్ట్ ఫోన్‌కు భారతీయులు బానిసలు అవుతున్నారా? అంటే అవుననే చెబుతోంది తాజాగా వెల్లడైన సర్వే ఒకటి. స్మార్ట్ ఫోన్ కారణంగా మానవసంబంధాల్ని మాత్రమే కాదు మనశ్శాంతిని.. ఆనందాల్ని మిస్ అయిపోతున్నారట. దేశ ప్రజల జీవితాల్లో భాగమైన స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు శరీరంలో ఒక అవయువంగా మారిందని చెప్పక తప్పదు. స్మార్ట్ ఫోన్ లేకుండా ఊహించుకోలేమన్నంత తీవ్రంగా దాని మోజులో పడిపోయినట్లుగా సర్వే చెబుతోంది. సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థతో పాటు చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో కలిసి నిర్వహించిన సర్వే నివేదిక తాజాగా బయటకు వచ్చింది. దేశ ప్రజలు ఏడాదిలో సగటున75 రోజులు ఏకంగా స్మార్ట్ ఫోన్ కు పరిమితమైపోతున్న షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. అంటే.. ఏడాదిలో 1800 గంటలు స్మార్ట్ ఫోన్ లోనే లీనమైపోతున్నట్లు చెప్పటమే కాదు.. ఫోన్ లేకుండా తాము బతకలేమన్నట్లుగా పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం.
ఇదే రీతిలో స్మార్ట్ ఫోన్ వాడుకుంటూ పోతే మానసిక.. శారీరక సమస్యలు ఎక్కువ కావటం ఖాయమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడప్పడు స్మార్ట్ ఫోన్ ను స్విచ్ఛాప్ చేస్తే ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉందంటున్నారు. ఫోన్ పుణ్యమా అని 30 శాతం కంటే తక్కువ మంది మాత్రమే నెలలో పలుమార్లు తమ కుటుంబ సభ్యుల్ని కలుసుకోగలుగుతున్నట్లు చెప్పారు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ముగ్గురిలో ఒకరు తాము తమ స్నేహితుల్ని.. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కనీసం ఐదు నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నట్లు పేర్కొనటం విశేషం. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ముగ్గురు మాత్రం స్మార్ట్ ఫోన్ నుంచి దూరంగా ఉంటేనే మరింత ఆనందంగా ఉంటామని చెప్పుకొచ్చారు. సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది తమ వద్ద.. తమ పిల్లల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నట్లు తెలిపారు. హైస్కూల్ పిల్లలు 41 శాతం మంది ఫోన్ కు బాగా అలవాటు పడినట్లు గుర్తించారు.
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఉంటుంది. అదష్టమో, దురదష్టమో కాని స్మార్ట్‌ఫోన్ నేడు మానవ దైనం దిన జీవితంలో భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, అందల మెక్కేసినట్లుగా చెలరేగిపోతోంది నేటి యువత. యువతనే కాదు, స్మార్ట్ ఫోన్లకు దాదాపుగా ప్రతి ఒక్కరూ బానిసలుగా మారిపోతు న్నారు. సిటీల నుంచి ప్రారంభమైన స్మార్ట్ ఫోన్ల వాడకం ప్రస్తుతం ప్రతి గ్రామానికి పాకి వ్యక్తులను తనకు బాని సలుగా మార్చుకుంది. 4వ జెనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్‌ఫోన్ మరింత స్మార్ట్‌గా జనానికి చేరువైపోయింది. యువత జీవితంలో భాగ స్వామ్యం అయిపోయాయి. ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియాతో యువత ప్రతి క్షణం మునిగి తేలుతోంది. అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి అంతర్జాలానికి బానిసలుగా మారే ప్రమాదం ఏర్పడింది. గత రెండు మూడు సంవత్సరాల నుంచి యువకుల జీవితాలలో అవాంఛనీయ ధోరణి ప్రారంభమైంది. సోషల్ మీడియా వ్యసనానికి బానిసలయ్యా క యువకులు త్వరగా డిప్రెషన్‌కి లోనవుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ లకు అలవాటైపోయిన యువకులు రోజు ఇంటర్నెట్ అందుబాటులో లేక పోతే తల్లడిల్లి పోతున్నారు. ఇంట ర్నెట్ సిగ్నల్ సరిగా రాకపొతే సిగ్నల్ కోసం ఇంటిపైకి ఎక్కి తాపత్రయ పడుతున్నారు. ఎక్కడికి వెళ్తోందో ఈ సమాజమని అప్పుడప్పుడు భయం వేస్తోంది. దీనికి కారకులు ఎవరూ..!
చిన్నపిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ పడగానే పిల్లవాడి ఏడుపు ఆపె స్తున్నాడంటే ఆలోచించండి. నేడు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సి.సి.ఈ. విద్యావిధానంతో కూడా ప్రాజెక్టుల పేరుతో పిల్లల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతోంది. బాలలకు ఆలోచనగుణం మందగించడం, ప్రతి దానికి గూ గుల్‌పై ఆధారపడటం మామూలైపోయింది. పిల్లలలో మానసిక స్తబ్దత కూడా పెరుగుతోంది. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతూ మన ఆరోగ్య విషయాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నాం. తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు లభించ డంతో.. ప్రతి ఒక్కరూ వాటిని క్షణాల్లో కొనేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లకు తోడు స్వల్ఫ దరకే అపరిమిత అంతర్జాలం. ఈ రెండింటికి తోడు.. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్, ట్విట్టర్లతో పాటు అనేకరకాల ఆప్స్ అరచేతిలో ఆటాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్లలో కొత్తకొత్త ఆప్స్లకు వ్యసనంగా మారి పోయిన యువత.. స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్కక్షణం కూడా ఉండలేక పోతు న్నారు.
చదువుకునే వయసులో పుస్తకాల పురుగులు కావాల్సిన పిల్లలు.. సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుం టున్నారు. పాఠశాలలు, కళాశాలలు వదిలిన తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలు .. బ్యాగులను ఓ మూలనపడేసి స్మార్ట్ ఫోన్లు వాడకంలో మునిగి తేలు తున్నారు. ఏ ఫ్రెండ్ ఏం పోస్టు చేశాడు? తను పెట్టిన ఫోటోకు ఎంతమంది లైక్‌లు కొట్టారు? ఎంతమంది షేర్ చేశారు? ఏం కామెంట్స్ రాశారు? అని స్మార్ట్ ఫోన్లను పట్టుకుని వెతుకుతున్నారు. చివరకు తిండిని కూడా మరిచి పోతున్నారు. నిద్ర కూడా సరిగా పోకుండా అనారోగ్యానికి గురవుతున్నా రనడంలో సందేహం లేదు. స్మార్ట్ ఫోన్ వాడకపోతే ప్రపంచానికే దూరమైపో తున్నట్లు భావించి బంగారు భవిష్యత్‌ను యవ్వనంలోనే చాలించుకుంటున్న యువత. టెక్నాలజీ అందించిన స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోనే విహారిస్తున్న యువత, ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక, సెక్స్‌పరమైన విషయాల పట్ల స్పందించటంలో కూడా ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఇది మానవాళి మను గడకు దుష్పరిణామం. యువత, పిల్లలలోని ప్రవర్తన, ఆలోచనా ధోరణు లను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత, సరిదిద్దాల్సిన బాధ్యత పెద్దలపైనే ఉంది. విచిత్రమేమిటంటే స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటడం, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం- ఈ పరధ్యానంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు కోకోల్లలు. స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రపై చెడ్డ ప్రభావం చూపిస్తోంది. రాత్రి పడకగదిలో మంచంపైకి ఎక్కిన తర్వాత కూ డా స్మార్ట్ ఫోన్‌తో నిద్ర సరిగా పట్టదు.
ఇంకొందరు పడుకునే ముందు ఫేస్ బుక్, వాట్సాప్‌లలో మెసేజ్‌లను చూడనిదే నిద్రకు ఉపక్రమించే పరిస్థితి. స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల ఏకాగ్రత, జ్ణాప కశక్తి తగ్గిపోతుంది. స్మార్ట్ ఫోన్ పడక గదిలోకి ప్రవేశించింది, దాంపత్య జీ వితాలలో చిచ్చులు, గొడవలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఆనందంగా గడిపిన జీవితం సెల్ ఫోన్ ప్రవేశంతో దుఃఖ సాగరం లో మునిగిపోయింది. తన జీవిత భాగస్వామితో సన్నిహితంగా మెలగ డానికి సమయం దొరకడం లేదు. నిద్ర కూడా కరువవుతోంది. శ ంగా రంపై ఆసక్తి తగ్గిపోతోంది. శ ంగారం మధ్యలోనూ వాట్సాప్ మెస్సేజ్‌లు చూసుకునే వారు ఉంటున్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల కంటే స్మా ర్ట్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నా రు. గారాబంగా చూసుకుంటున్న తన కూతురు తన స్మార్ట్ ఫోన్ కింద పడేస్తే ఆ తండ్రి అరుపులు వింటే ఆ వ్యక్తి మనుషుల కంటే వస్తువులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా అర్థమవుతుంది. స్మార్ట్ ఫోన్‌తో సరదాగా గడిపే సమయంలో నాలుగో వంతు కూడా పిల్లలతో గడపడానికి కేటాయించడం లేదు. పరస్పరం కలుసుకుని, ముఖాముఖి సం భాషించుకోవడం అనేది జరుగడం లేదు. దీనితో అనురాగం, ఆప్యాయతలు, అభిమానం, ప్రేమల విలువల తెలియడం లేదు. యువతలో స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ ఫోటోలు తీయడం పిచ్చిగా మారింది. ఎక్కడ పడితే సెల్ఫీలు దిగడం మామూలై పోయింది. నిద్రలేమి వలన డిప్రెషన్లోకి వెళ్తున్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా సోషల్ మీడి యా ప్రపంచంలో మునిగిపోయిన యువత తమ స్నేహితులతో, బంధువులతో, సన్నిహితులతో కాలం గడిపే సమయమే తగ్గి పోతోంది. ఫలితంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తీవ్రమైన వ్యాకులత, నిస్ప హ, ఒంటరితనానికి లోనౌతోంది యువత. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే! రోడ్డుపైన, రద్దీ ప్రదేశాల్లో ఫోన్ వాడడం ఎంత మా త్రం సురక్షితం కాదు. యువత చేతుల్లోకే భావి ప్రపంచం వెళ్లబోతోంది. కాబట్టి యువతపై ప్రత్యేక ద ష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అతిగా ఫోన్ వాడకాన్ని తగ్గించుకోపోతే యువత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. కావున సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరానికి వాడుకోవాలి గాని బానిస కారాదు.