ఆన్‌లైన్‌లో చూసి 24 క్రాఫ్ట్స్‌ నేర్చుకున్నాను

హీరో చేతన్‌ మద్దినేని

రోజులు మారాయి, గల్ఫ్‌, ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు, చిత్రాల్లో నటించిన చేతన్‌ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న రా అండ్‌ రియలిస్టిక్‌ రస్టిక్‌ ఫిలిం ”బీచ్‌ రోడ్‌ చేతన్‌”. చేతన్‌ మద్దినేని ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చేతన్‌ మద్దినేని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.
ఉచితంగా ప్రీమియర్‌ షోలు వేయాలని ఎందుకు అనిపించింది ? నష్టం కాదా?
అందరికీ తెలిసిందే. చిన్న మూవీస్‌ ను ఎవ్వరు పట్టించుకోరు. పట్టించుకోవాలంటే అన్‌ లైన్‌ లో ఆ మూవీ టీజర్‌ నో ట్రైలర్‌ నో వైరల్‌ అవ్వాలి. అలా వైరల్‌ అయ్యే కంటెంట్‌ ఈ సినిమాలో లేదు. అందుకే ఈ సినిమా ఆడియన్స్‌ కి ఈజీగా కనెక్ట్‌ అవ్వాలి, వాళ్లకు ఈ సినిమా గురించి బాగా తెలియాలనే ఉద్దేశ్యంతో ప్రీమియర్‌ షోలు వేయటం జరుగుతుంది.

ప్రేక్షకులకు ఉచితంగా చూడాలంటే మీ సినిమాకు సంబంధించి ఎవరిని సంప్రదించాలి?
సింగిల్‌ స్క్రీన్స్‌ దగ్గర థియేటర్స్‌ దగ్గరే టికెట్స్‌ ఇస్తున్నాము. ఇక మల్టీప్లెక్స్‌ ల్లో మా సినిమా ఏజెంట్‌ బోర్డు ఉంటాడు. అతను టికెట్స్‌ ఇస్తాడు. ఒకవేళ బుక్‌ మై షోలో ఎవరైనా టికెట్స్‌ ముందుగానే బుక్‌ చేసుకుంటే.. థియేటర్‌ దగ్గర మీరు మా సినిమా ఏజెంట్‌ను కలిస్తే అతను మీకు టికెట్‌ మనీ వెనక్కి ఇచ్చేస్తాడు.

”బీచ్‌ రోడ్‌ చేతన్‌” తో ఏం చెప్పదలిచారు?
మూవీ ఒక రియలిస్టిక్‌ రా ఎంటర్‌ టైనర్‌. ఈ సినిమా స్క్రీన్‌ ప్లే కూడా.. డీప్‌ అండ్‌ ఇన్నర్‌ మీనింగ్‌ తో సాగుతుంది. అంటే ఈ సినిమా పూర్తిగా యాక్షన్‌ థ్రిల్లర్‌.

హీరోగా, దర్శకనిర్మాతగా ఎలా చేయగలిగారు?
నాకు ఎప్పటినుండో ఒక మంచి యాక్షన్‌ ఫిల్మ్‌ చేయాలని బాగా ఉండేది. ఆ క్రమంలో చేసిందే ఈ సినిమా. నిజానికి నాకు మొదటి నుంచీ దర్శకత్వం మీద ఇంట్రస్ట్‌ ఉంది. అలాగే నిర్మాతగా నా అభిరుచిని ఇతరులపై రుద్దడం ఇష్టంలేక నేనే ఈ కథపై నమ్మకంతో నిర్మాణం చేపట్టడం జరిగింది.
ఈ సినిమా నిర్మాణంలో మీ నాన్నగారి సపోర్ట్‌ ఎలా ఉంది ?
డాడీకి చెప్పాను. బట్‌ ఆయన నీకు ఎందుకు డైరెక్షన్‌, హీరోగా సినిమాలు వస్తున్నాయి.. చేసుకోవచ్చు కదా అని అన్నారు. కానీ, నాకు నేను రాసుకున్న కథను ఎలాగైనా చెప్పాలి అనే ఇంట్రస్ట్‌ తో నేను సేవ్‌ చేసుకున్న డబ్బులతో ఈ సినిమా చేశాను.

ఎలాంటి అనుభవం లేకుండా దర్శకత్వం చేయటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
నాకు డైరెక్షన్‌ పరంగా నాకు అనుభవం లేదు. కానీ డైరెక్షన్‌ మొత్తం అన్‌ లైన్‌ లో చూసే నేర్చుకున్నాను, డైరెక్షన్‌ ఎలా చేయాలి, షాట్‌ మేకింగ్‌ గురించి ఇలా 24 క్రాఫ్ట్‌లకు సంబంధించి అన్‌ లైన్‌ లోనే చూసి నేర్చుకున్నాను.

ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు తరువాత మీకు ఆఫర్స్‌ రాలేదా ?

ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు తరువాత ఆల్‌ మోస్ట్‌ 7, 8 సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా రిలీజ్‌ తరువాతే.. నెక్స్ట్‌ మూవీ గురించి ఆలోచిద్దామని వచ్చిన అవకాశాల్ని హోల్డ్‌ లో పెట్టాను. ఈ సినిమా పై నాకు అంత నమ్మకం ఉంది.

మీ తదుపరి సినిమాల గురించి ?

రెండు సబ్జెక్టులు ఉన్నాయి. హారర్‌ కామెడీ ఒకటి. అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ స్టోరీ ఇంకొకటి. అయితే ప్రస్తుతానికి అయితే ఈ సినిమా రిలీజ్‌ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.