రూ.10 నుంచి రూ.30కి పెంచిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్: దసరా రద్దీని దష్టిలో ఉంచుకుని ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరను దక్షిణ మధ్య రైల్వే పెంచింది. ప్రస్తుతమున్న టికెట్ ధరను రూ.10 నుంచి రూ.30కి పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పెంచిన ధరలు విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో అమలు కానున్నాయి. నేటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి. రైలు ప్రయాణికుల రద్దీని ద ష్టిలో ఉంచుకొని ఏటా సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో ప్లాట్ఫామ్ టికెట్ ధరను పెంచుతుంటారు. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులు, స్నేహితుల రద్దీని నివారించడంతో ఆదాయం పెంచుకోవడానికి ఏటా టికెట్ ధరను ద.మ.రైల్వే తాత్కాలికంగా పెంచుతుంటుంది. అయితే, గతంలో రూ.10 నుంచి రూ.20కి పెంచేవారు. తాజాగా మరో రూ.10 అదనంగా వడ్డించడం గమనార్హం.